పంట నమోదు క్లైమ్... ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి
మండల వ్యవసాయ అధికారి ఆర్.చంద్రశేఖర్ రావు
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
తర్లుపాడు మండలం లోని రైతు భరోసా కేంద్రం నందు గ్రామ వ్యవసాయ సలహామండలి సభ్యులకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించబడినది. ఈ ట్రైనింగ్ లో భాగంగా మండల వ్యవసాయ అధికారి ఆర్.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ పంట నమోదు గురించి చర్చిస్తూ పంట నమోదు పూర్తి అయిన తర్వాత డిజిటల్ ఏక్నాలజీమెంట్ అందజేస్తామని, రబీ సీజన్ కి సంబంధించి మినుములు, శనగలు అందుబాటులో ఉంటాయని డి క్రిష్ యాప్ లో బుకింగ్ చేసుకోవాలని తెలియజేశారు.
పంట నమోదు సంబంధించి క్లయిమ్ ప్రతి రైతుచేయించుకోవాలని, పంట నమోదు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేశారు. ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో పొలంబడి కార్యక్రమం నిర్వహణ గురించి చర్చిస్తూ, పొలంబడి 14 వారాల పాటు నిర్వహిస్తామని తెలియజేశారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ క్రింద అందుబాటులో ఉన్న పరికరాలను కావలసిన రైతులు అద్దెకు ఉపయోగించు కోవచ్చునని తెలియజేయడం జరిగింది.
రైతులకు తైవాన్ స్ప్రేయర్ ఉద్యానవన శాఖ లో అందుబాటులో ఉన్నాయని, సబ్సిడీలు లభిస్తున్నాయని, కావలసిన రైతులు అప్లై చేసుకొని తీసుకోవాలని తెలియజేశారు. ఈ సభకు గ్రామ అడ్వైజరీ బోర్డు మెంబర్స్, రైతులు, వి ఏ ఏ డి.గోవింద్ భాష మరియు తర్లుపాడు,శీ తానాగులవరం, గానుగపెంట, పోతల పాడు, కలుజువ్వలపాడు, కేతగుడిపి గ్రామ అడ్వైజరీ బోర్డు మెంబర్స్ పాల్గొనడం జరిగినది.
Post A Comment:
0 comments: