హంగామా హైలైఫ్తో,,,
గతంలో ఎన్నడూ లేనట్టి రీతిలో,,,
వినోదాన్ని ఆస్వాదించండి
హంగామా నుంచి అందుబాటు ధరలలో జీవనశైలి ఉత్పత్తులు
(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)
భారతదేశంలో సుప్రసద్ధ డిజిటల్ వినోద సంస్థ హంగామా తమ లైఫ్‌స్టైల్ బ్రాండ్ హంగామా హై లైఫ్‌ను ఆవిష్కరించింది. వినియోగదారులు ఇప్పుడు మహోన్నతమైన వినోద అనుభవాలను వీటిద్వారా పొందగలరు. ఈ శ్రేణిలో అత్యంత సహజంగా డిజైన్ చేసిన వినియోగదారుల సాంకేతిక ఉత్పత్తులు అయినటువంటి బ్లూటూత్ హెడ్‌ఫోన్స్, ట్రూలీ వైర్లెస్ ఇయర్‌బడ్స్, నెక్ బ్యాండ్స్, బ్లూ టూత్ స్పీకర్లు ఉంటాయి. ప్రతి కొనుగోలుతో వినియోగదారులు హంగామా మ్యూజిక్, హంగామా ప్లే కోసం వార్షిక చందాలను పొందగలరు. హంగామా మ్యూజిక్ మరియు వీడియో స్ట్రీమింగ్ వేదికలు వినియోగదారులకు సమగ్రమైన వినోద ప్యాకేజీని అందిస్తాయి. ఈ చందాలను యాక్టివేట్ చేసుకోవడానికి వినియోగదారులు తమ ఎన్ఎఫ్సీ–కంపాటబల్ ఉపకరణాలను ప్రత్యేకమైన ఎన్ఎఫ్సీ కార్డులపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. వీటిని ప్రతి ఉత్పత్తితో పాటుగా అందిస్తారు. ఇలా కాకుండా వారు క్యుఆర్ కోడ్ వినియోగించడం ద్వారా కూడా యాక్టివేట్చేయవచ్చు. ఇవి 2199 రూపాయల నుంచి 4999 రూపాయల శ్రేణిలో అమెజాన్ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌పై లభ్యమవుతాయి.
హంగామా లైఫ్ గురించి నీరజ్ రాయ్, ఫౌండర్ అండ్ సీఈవో, హంగామా డిజటల్ మీడియా మాట్లాడుతూ ‘‘ఈ లైఫ్‌స్టైల్ టెక్నాలజీ విభాగం, అసాధారణ అవకాశాలను అందించనుంది మరియు హై లైఫ్ ఇప్పుడు హంగామా యొక్క వాగ్ధానం అయినటువంటి అసాధారణ వినోద సేవలు మరియు ఉత్పత్తులు అందిస్తామనే వాగ్ధానమూ చేస్తుంది. ఈ శ్రేణి యొక్క సాంకేతిక ప్రమాణాలు, సహేతుకమైన ధరలతో మిళితం కావడంతో అత్యున్నతమైనప్పటికీ, అందుబాటు శ్రేణిలో అనుభవాలను పొందాలనుకునే వినియోగదారులకు ఆసక్తికరమైన ప్రతిపాదనగా నిలుస్తుంది. రాబోయే సంవత్సరానికల్లా మా ఉనికిని ఐదు విభాగాలకు విస్తరించనున్నాం’’ అని అన్నారు.
రాబోయే కాలంలో హంగామా లైఫ్ ఉత్పత్తులలో మొబైల్,ల్యాప్‌టాప్ యాక్ససరీలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, యుటిలిటీ ఉత్పత్తులు వంటివి ఉండనున్నాయి
Home
Unlabelled
హంగామా హైలైఫ్తో,,, గతంలో ఎన్నడూ లేనట్టి రీతిలో,,, వినోదాన్ని ఆస్వాదించండి,,, హంగామా నుంచి అందుబాటు ధరలలో జీవనశైలి ఉత్పత్తులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: