దోపిడీ దొంగలను పట్టుకొన్న పోలీసులు

అభినందించిన జిల్లా ఎస్పీ

ప్రకాశం జిల్లా ఎస్పి మలిక గర్గ్ (ఐ.పి.ఎస్.)
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా ఎస్.పి. మల్లిక గర్గ్ (ఐ.పి.ఎస్.) ఆదేశాల మేరకు మార్కాపురం ఎస్.డి.పి.ఓ. డాక్టర్ ఎమ్. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సాగిన తనిఖీల్లో దొంగలు పట్టుబడ్డారు. వివరాలలోకి వెళ్లితే...మార్కాపురం మండలంలోని పెద్దారవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దారవీడు గ్రామములో దూదేకుల పీరమ్మ ఇంటిలోకి ప్రవేశించి ట్రంకు పెట్టె పగులకొట్టి అందులో ఉన్న 80 వేల రూపాయాల డబ్బులు, నల్లపూసల దండ సుమారు ఒక తులం, ఒక జత వెండి కాళ్ల పట్టీలు సుమారు 20 తులాలు, వెండి మెట్టెలు-8 సుమారు 4 తులాలు దొంగతనం జరిగింది అని, పెద్దారవీడు మండలంలోని కొన్ని గ్రామాలలో ట్రాన్స్ఫార్మర్లు పగులకొట్టి అందులోని రాగి వైరును దొంగిలించుకొని పోయినారని ఫిర్యాదు మేరకు మార్కాపురం ఎస్.పి.డి.ఓ. డాక్టర్ కిషోర్ కుమార్ ఉత్తర్వులపై మార్కాపురం సి.ఐ. బి.టి. నాయక్, పెద్దారవీడు ఎస్.ఐ. డి. రామకృష్ణ, మార్కాపురం రూరల్ ఎస్.ఐ. జి. కోటయ్య తన సిబ్బంది అయిన HCs 1307, 3969 PCs 688, 2591, 2592, 2477లతోపాటు 14-09-2021వ తేది ఉదయం 8 గంటల సమయంలో పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట గ్రామం నేషనల్ హైవే HP పెట్రోల్ బంకు వద్దకు చేరారు.

 

మార్కాపురం డివిజన్ డి.ఎస్.పి. ఎమ్. కిషోర్ కుమార్

పైన పేర్కొన్న ముగ్గురు ముద్దాయిలు అక్కడ ఉండి , పోలీస్ వారిని చూసి  పారిపోవుచుండగా పట్టుకొని మధ్యవర్తుల సమక్షంలో వారిని విచారించగా A1 మరియు A2 నిందితులు పెద్దారవీడు పోలీస్ స్టేషన్ Cr.Nos. 146/2021, u/s 457, 380 IPC పెద్దారవీడు గ్రామములోని దూదేకుల పీరమ్మ ఇంటిలోనికి 28-08-2021వతేది రాత్రి ప్రవేశించి ట్రంకు పెట్టె పగులకొట్టి అందులో ఉన్న 80 వేల రూపాయాల డబ్బులు, నల్లపూసల దండ సుమారు ఒక తులం,


ఒక జత వెండి కాళ్ల పట్టీలు సుమారు 20 తులాలు, వెండి మెట్టెలు 8 సుమారు 4 తులాలు దొంగ తనం చేసినట్లు మరియు A1 మరియు A3లు  పెద్దారవీడు, మార్కాపురం మరియు అర్ధవీడు మండలాల పరిధిలో ట్రాన్స్ఫార్మర్లు పగులకొట్టి అందులోని రాగివైరును దొంగిలించి, దొంగిలించిన సొత్తును మరియు రాగి వైరును అమ్ముటకు వినుకొండకు వెళ్ళుటకు పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట గ్రామం నేషనల్ హై వే HP పెట్రోల్ బంకు వద్దకు రాగ మీరు పట్టుకున్నారని చెప్పిన మేరకు ముద్దాయిలను 14-09-2021వ తేది ఉదయం 11.00 గంటలకు పెద్దారవీడు  SI గారు అరెస్ట్ చేయడమైనది.


అరెస్ట్ చేయబడిన ముద్దాయిలు చెడు వ్యసనాలకు, మద్యానికి బానిస అయి ఈజీగా డబ్బులు సంపాదించుటకు అలవాటు పడి దొంగతనం చేసినారు. పై కేసులో ముద్దాయిలను పట్టుకొనుటలో ప్రతిభ కనపరచిన మార్కాపురం SDPO Dr. M. కిషోర్ కుమార్, మార్కాపురం సి.ఐ. B.T. నాయక్, పెద్దారవీడు SI D. రామకృష్ణ, మార్కాపురం రూరల్ SI G.కోటయ్య తన సిబ్బంది అయిన HCs 1307, 3969 PCs 688, 2591,2592, 2477లను ప్రకాశం జిల్లా S.P. మలిక గర్గ్ IPS గారు అభినందించినారు. 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

    

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: