థర్ఠ్ వేమ్ ను ఎదుర్కొనేందుకు సన్నద్దంకండి

అన్ని చర్యలను పకడ్భందీగా చేయండి

వైద్యాధికార్లకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశం(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)        

కోవిడ్ మూడవ దశ ఎదుర్కోడానికి  పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని యాలని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. మార్కాపురం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన పి ఎస్ ఏ ప్లాంట్, 500 ఎల్ పి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం, జనరేటర్ ను ఆయన పరిశీలించారు.  వైద్యశాలలో నూతనంగా చేపట్టిన ఆక్సిజన్ పైపులైన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ మూడో దశ వచ్చినప్పటికీ ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేకుండా మెరుగైన వైద్యం అందించేలా అప్రమత్తం కావాలని ఆయన పలు సూచనలు చేశారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఒకటవ అంతస్తులో అసంపూర్తిగా నిలిచిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్యశాలలో 150 పడకలు ఉండగా డయాలసిస్ చేయించుకునే కిడ్నీ వ్యాధిగ్రస్తులకోసం 50 పడకలు, కోవిడ్ బాధితుల కోసం 100 పడకలు సిద్ధం చెయ్యాలన్నారు ప్రస్తుతం 150 ఆక్సిజన్ సిలిండర్లు 164 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు ఏర్పాటు చేశామని వైద్య అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
36 మంది వైద్యులు పని చేస్తున్నారని ఆయనకు కు వవరించారు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి లోపాలు ఉండరాదని ఆయన ఆదేశించారు. మార్కాపురం మండలం రాజుపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. శిథిలమైన పాఠశాల భవనం కూలి బాలుడు మృతి చెందిన  సంఘటనతో తొలగించిన భవనం స్థలాన్ని ఆయన పరిశీలించారు. సమీపంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు పాఠాలు బోధించి ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. గ్రామంలో చిన్నారుల సంఖ్య, పాఠశాలకు వస్తున్న విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు. గ్రామంలో డ్రాప్ అవుట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. పాఠశాల సమీపంలోనే శిథిలావస్థకు చేరిన ఓవర్ హెడ్ ట్యాంక్ కూలేందుకు సిద్ధంగా ఉందని దానిని తొలగించాలని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. తక్షణమే చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు ఆయన హామీ ఇచ్చారు.  రామచంద్రాపురంలో భూముల రీ సర్వే కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే చేస్తున్న సిబ్బంది వద్ద సమగ్ర వివరాలు లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను సర్వే చేస్తున్నారా లేక తమాషా చేస్తున్నారా.. అంటూ మండిపడ్డారు.
సమగ్ర వివరాలు లేకుండా రైతులకు భూమి ఎలా సర్వే చేసి, వారి హద్దులు నిర్ధారిస్తారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.  రీ సర్వే సక్రమంగా చేయడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబద్ధతతో పనిచేయాలని సర్వే అధికారులు, సర్వేయర్ లకు ఆయన పలు సూచనలు చేశారు. అదే గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని ఆయన పరిశీలించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వ సేవలు అందించడంలో ఎలాంటి ఆటంకాలు రాకూడదన్నారు. ఆయన వెంట మార్కాపురం ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి, తహసిల్దార్ ఎలిషా, సర్పంచ్ లక్ష్మయ్య, అధికారులు, తదితరులు ఉన్నారు.✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   


  

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: