అమరుల ఆత్మక్షోభకు కారకుడు రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ నేత అలకుంట హరి
రేవంత్ రెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు వచ్చినందుకు మలినం అయిందని టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు అమరవీరుల స్థూపాన్ని గోమూత్రం తో శుద్ధి చేసి, పాలాభిషేకం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర సాధనను అడ్డుకుని ఎంతో మంది అమరుల ఆత్మక్షోభకు కారకుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని టీఆరెస్ యూవజన విభాగం గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్షుడు అలకుంట హరి పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాకతో అమరవీరుల స్తూపం అపవిత్రం అయ్యిందని అందుకే గన్ పార్క్ ను శుద్ధి చేసినట్లు వారు తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో ఒక్క రోజు పాల్గొనని రేవంత్ రెడ్డికి అమరవీరుల స్తూపం పరిసరాలకు వచ్చే అర్హత లేదన్నారు.డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం లేని కేటీఆర్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని మండిపడ్డారు.సమైఖ్యవాది, చంద్రబాబు చెంచా రేవంత్ రెడ్డి అని ఎద్దేవాచేశారు.వెంటనే రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి.లేనిపక్షంలో రేవంత్ ఇంటిని ముట్టడిస్తాం అని ప్రత్యేక్ష దాడులు చేస్తాం అని టిఆర్ఎస్ యువజన విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అలకుంట హరి హెచ్చరించారు.
Post A Comment:
0 comments: