ఆ అవకతవకలపై నజర్ పెట్టండి

ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ నేత జి.నిరంజన్ వినతి


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

హుజూరాబాద్ ఎన్నికల నిమిత్తం, కరీంనగర్ లో నిబందనలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈవిఎమ్, వివిప్యాట్ల ఎఫ్ ఎల్ సి ( మొదటి లెవెల్ చెకప్) అవకతవకలను రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కి సవివరంగా వివరిస్తూ ఎన్నికల కమిషన్ కు ఈ మెయిల్ ద్వారా పంపిన లేఖ ప్రతిని పి.సి.సి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్, పిసిసి ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీ సభ్యుడు పి.రాజేశ్ కుమార్ ఆదేశించారు. అక్కడ ఎన్నికల కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు, బి ఇ ఎల్ ఇంజనీర్లు జరుపుతున్న ఎఫ్ ఎల్ సి విధానాని సవివరంగా వివరించారు. ఈవిఎం వివిప్యాట్ లను భద్రపరిచే గోడౌన్ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నదని, వాటి రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదమున్నదని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎఫ్ ఎల్ సి ని వెంటనే రద్దుచేసి, గోడౌన్ లో భద్రతా పరమైన చర్యలు చేపట్టిన తరువాతనే తిరిగి ఎఫ్ ఎల్ సి ని చే పట్టాలని కోరారు. ప్రస్తుత ఈవిఎమ్ ల నోడల్ ఆపీసర్ ను మార్చాలని, ప్రస్తుత జిల్లా కలెక్టర్ ను కూడా ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే బదిలీ చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వయించాలని కోరారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: