గ్రామ నడిబొడ్డున బావి

అటు ప్రజల ప్రాణాలకు...ఇటు అంటు రోగాలకు 

కారణమవుతున్న బావి

వాటిని తొలగించి వాటి స్థానంలో ప్రయోఉపయోగ కార్యక్రమం

చేపట్టాలని కోరుతున్న బిలకలగూడూరు వాసులు

గ్రామ నడిబొడ్డున దుర్గందం వెదజల్లుతున్న బావి ఇదే
(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

గ్రామ నడిబొడ్డున మంచి రోడ్డు ఉండాలి. కానీ ఆ గ్రామంలో మాత్రం నడిబొడ్డున బావి ఉంది. ఆ బావి ప్రజాలకు ఉపయోకరంగా ఉందా అంటే లేదు. పైగా చిన్న పిల్లల ప్రాణాలకు ప్రమాదపూరితంగా మారింది. ఇక ఆ బావిలో చెత్త పెరుక్కుపోవడంతో దుర్గంధం వెలువడుతోంది. దీంతో అక్కడ ప్రజలు ఊపిరిపిల్చుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. అంతేకాదు ఆ దుర్గంధానికి ప్రజలు అక్కడికి రావాలంటేనే జంకుతున్నారు. వివరాలలోకి వెళ్లితే కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని బిలకలగూడూరు గ్రామంలోని వింత పరిస్థితి ఇది. ఈ గ్రామంలోని నడిబొడ్డున ఓ పాడుబడిన బావి ఉంది. ఇది గ్రామంలోని చుట్టుపక్కలంతా దుర్గందం వెదజల్లుతోంబది. అంతేకాదు తొలినుంచి ఈ దుర్గందం వల్ల అక్కడ దోమలకు నిలయంగా మారింది. ప్రస్తుతం ఇది వర్షాకాలం కావడంతో ఈ బావిలో మరింత దుర్గందం పెరిగి దోమలు మరింత  పెరిగేందుకు కారణమవుతోంది.
ఇదిలావుంటే ఈ బావిలో గతంలో ఓ చిన్నపిల్లాడు పడి మరణించడం జరిగిందని స్థానిక ప్రజలు చెప్పారు. ఇదే విషయాన్ని పలుమార్లు అధికార్లకు తెలియజేసిన ఫలితంలేకుండా పోయిందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికార్లు ఆ బావి గురించి ఆలోచించి చర్యలు తీసుకొంటారని గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని జానోజాగో వెబ్ న్యూస్ గడివేముల ప్రతినిధి దృష్టికి తీసుకొచ్చారు. ఈ వార్తను చూసైనా సంబంధిత అధికార్లు తమ గ్రామ నడిబోడ్డున ఉన్న ఆ బావి వైపు చూసి దానిని పూడ్చి ఆ స్థానంలో గ్రంథాలయం గానీ గ్రామ సచివాలయం గానీ నిర్మించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకొంటారని వారు ఆశిస్తున్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: