ఆ భూములను పేదలకు పంచాలి

సిపిఎం మార్కాపురం ప్రాంతీయ కమిటీ డిమాండ్

ఆర్డిఓ లక్ష్మీ శివ జ్యోతికి వినతిపత్రం సమర్పించిన నేతలు

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురం మండల పరిధిలో వివిధ ప్రాంతాల్లో అక్రమంగా అనర్హులకు  కట్టబెట్టిన ప్రభుత్వ అసైన్డ్ భూములను వెంటనే స్వాధీనం చేసుకోని ఆయా గ్రామాలలో భూమిలేని దళితులకు, బీసీలకు పంపిణీ చేయాలని అక్రమాలకు పాల్పడిన రాజకీయ నాయకులపై కూడా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారంనాడు సిపిఎం మార్కాపురం ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో మార్కాపురం ఆర్డిఓ లక్ష్మీ శివ జ్యోతి ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  సిపిఎం మార్కాపురం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన మార్కాపురం తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పై చర్యలతో మార్కాపురం తహసిల్దార్ కార్యాలయం ఖాళీ అయింది అని ,  రాజకీయ పెద్దల ప్రోద్బలంతో మార్కాపురం తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది అనర్హులకు పెద్ద ఎత్తున  మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రభుత్వ భూములను అనర్హులకు కట్టపెట్టడం జరిగిందని,

 

సదరు భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, మార్కాపురం ప్రాంతం నిత్యం కరువుకాటకాలతో సెంటు భూమి కూడా లేని వ్యవసాయ కూలీలు నిరంతరం మార్కాపురం ప్రాంతం వదలి సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్ళటం అందరు గమనిస్తూనే ఉన్నారు అని అన్నారు.పేదలు, భూమి లేని వ్యవసాయ కూలీలు,దళితులు, బీసీలు మార్కాపురం మండలం లో పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు. సదరు పేదలకు ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు పంచాలని సిపిఎం మార్కాపురం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య డిమాండ్ చేసినారు. అక్రమాలకు పాల్పడి పెద్ద ఎత్తున భూములు పొందిన అక్రమార్కులను వదిలివేయటం వి ఆర్ ఓ ల పై సస్పెన్షన్ వేటు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం వరకే పరిమితం కాకూడదన్నారు.

సి.పి.ఎం. నాయకులు డి. సోమయ్య, యేనుగుల సురేష్ కుమార్
 సదరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, వారిని శాశ్వతంగా ఉద్యోగాలనుంచి తొలగిస్తే   భవిష్యత్తులో ఇటువంటి అక్రమ చర్యలు పునరావృతం కాకుండా ఉండే అవకాశం ఉంది అన్నారు. ప్రభుత్వం ఈపని చేయనట్లయితే పేదలే సదరు భూములను ఆక్రమించుకొని సాగు చేసుకొనుటకు వెనుక అడుగు వేయరు అని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి.కె.ఎం.రఫీ, పందిటి రూబేను,జవాజి రాజు, జనుమాల నాగయ్య, వేసేపోగు కిరణ్, యద్దనపూడి ఏసేబు, ఏనుగుల సురేష్ కుమార్ తదితరులు ఉన్నారు.

సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షుడు డి.ఎం.కె. రఫీ

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: