*జనం మెచ్చిన జగన్*

మార్కాపురం ఎమ్మెల్యే కేపీీ జి నాగార్జున రెడ్డిి


(జానో జాగో వెబ్ న్యూస్ -మార్కాపురం ప్రతినిధి)

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్న జరిగిన పంచాయతీ  ఎన్నికల్లో లో ..నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో... నేడు ఎంపీటీసీ , జెడ్ పి టి సి ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ  పనితీరుపై అపారమైన నమ్మకంతో అభిమానంతో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఆశీర్వదించారనీ మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున్ రెడ్డి అన్నారు. జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ...ఈ సంతోషం ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రంలో కనివిని ఎరుగని విధంగా రాష్ట్ర చరిత్రను తిరగరాసే విధంగా 13 జిల్లా పరిషత్ స్థానాలను వై.ఎస్. ఆర్. సి. పి.కి అందించారు .ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయి. రాష్ట్రంలో టిడిపి పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది.

పార్టీ్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. పరిషత్  ఎన్నికల్లో ఈ విషయము  స్పష్టంగా బయటపడింది. ప్రతిరోజు ప్రభుత్వ   పనితీరుపై ప్రజలు పెంచుకున్న మమకారం అభిమానం చూసి పోటీలో ఉంటే ఓడిపోతామని టిడిపి పార్టీ  గ్రహించి పోటీ నుంచి రాష్ట్రస్థాయిలో  విరమించుకున్నారు .రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ప్రజలందరూ ఇంత పెద్ద ఎత్తున ఘన విజయాన్ని అందించి ఓట్ల రూపంలో  3 రాజధానుల ఏర్పాటుకై హృదయపూర్వకంగా మద్దతు తెలిపారు. మార్కాపురం నియోజకవర్గంలో చేస్తున్న సేవను గుర్తించి అన్ని ఎంపిటిసి, అన్ని జడ్పిటిసి  స్థానాల్లో వై.యస్.ఆర్.సి.పి అభ్యర్థులను ఆశీర్వదించిన ప్రజలందరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అని కేపీ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: