విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు

ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి

ప్రశాంతంగా విద్యా కమిటీ ఎన్నికలు


(జానో జాగో వెబ్ న్యూస్_మార్కాపురం  ప్రతినిధి)

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణములో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మునగాల. చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యములో ప్రశాంతంగా పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు ముగిసాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యార్ధుల తల్లిదండ్రుల ద్వారా పాఠశాల పాలక వర్గం కమిటీని ఎంపిక చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో విద్యా కమిటీ ఎన్నికలు బుధవారం నిర్వహించడం జరిగింది.


 ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతీ పేద కుటుంబం లోని పిల్లల గురించి అలోచించి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి,విద్యార్థులకు మంచి జరిగే విధంగా వ్యవహారిస్తోందాన్నారు. ప్రతీ ఒక్క విద్యార్థి బాగా చదుకోవాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక వంటి పథకాల ను ప్రవేశ పెట్టారని అన్నారు. ప్రస్తుతం పిల్లల పైన జరుగుతున్న అత్యాచారాల పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తం గా ఉండాలని విద్యార్థుల తల్లి, దండ్రులను కోరారు. ముఖ్యంగా మాట్లాడుతూూ

ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి

 విద్యార్థులను ప్రతీ తల్లి,తండ్రి జాగ్రత్తగా చూసుకోవాలని, పిల్లలను ఎక్కడా ఒంటరిగా పంపకూడదని తెలిపారు.ప్రస్తుత కాలంలో పిల్లల పైన అత్యాచారాలు ఎక్కువయిపోయాయని కనుక ప్రతీ ఒక్కరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అన్నారు. మా ఆహ్వనాన్ని మన్నించి పాఠశాలకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని యింత ఘనంగా నర్వహించేందుకు సహకరించిన ప్రతి విద్యార్ధి తల్లిదండ్రులకు  మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


       Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: