రాబియా సైఫి హంతకులకు ఉరిశిక్ష విధించాలి

- మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం 


(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మానభంగానికి గురై, హత్య కావించబడిన ముస్లిం సివిల్ డిఫెన్స్ అధికారి రాబియా సైఫీ కుటుంబానికి, న్యాయం చేసి, హంతకులకు ఉరి శిక్ష విధించాలని ఎం.పి.జె జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 4 నెలల క్రితం ఢిల్లీ నగరం లో సివిల్ డిఫెన్స్ అధికారిగా ఉద్యోగం సాధించిన రాబియా(21), గత నెల 26న విధులు నిర్వహిస్తున్న సమయంలో మానభంగానికి గురై, హత్య గావించబడ్డది. ప్రభుత్వాలు ఇంతవరకు స్పందించక పోవడం దారుణమన్నారు. రక్షణ శాఖలో పని చేస్తున్న ఉద్యోగినికే రక్షణ లేనప్పుడు, సామాన్యులకు రక్షణ ఎలా కల్పిస్తారని ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించారు. ఇంత జరిగినా జాతీయ మీడియా స్పందించక పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. గత ఏడేళ్ళ బి.జే.పి పాలనలో ముస్లిములు, దళితులపై అత్యాచారాలు, మానభంగాలు తీవ్రస్ఠాయిలో పెరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. కాబట్టి వెంటనే ఢిల్లీ మరియు కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని రాబియా పట్ల పాశవికంగా ప్రవర్తించి, హత్యకు పాల్పడిన హంతకులకు ఉరిశిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఖాసిం డిమాండ్ చేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

    


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: