ఎలాంటి నష్టం జరగకుండా నష్టపరిహారం

  వెలిగొండ ప్రాజెక్టు ముంపు బాధితులకు హామీ

కలెక్టర్ ప్రవీణ్ కుమార్         

 

 (జానో జాగో వెబ్ న్యూస్_  మార్కాపురం ప్రతినిధి)         

 వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చట్ట ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కాకర్ల గ్యాప్ ముంపు ప్రాంతాలైన అర్ధవీడు మండలంలోని కాకర్ల, కృష్ణానగర్, లక్ష్మీపురం గ్రామాలలో గురువారం  ఆయన విస్తృతంగా పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామాల ప్రజల నుంచి  అర్జీలను ఆయన స్వీకరించారు.

         ప్రజలను తరలించిన తరువాతనే కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాలోకి వస్తాయని జిల్లా కలెక్టర్ చెప్పారు. ముంపు గ్రామాలలోని ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన వుహామీ ఇచ్చారు. కాకర్ల కింద 12 వేల ఎకరాలకు గాను, ప్రస్తుతం మూడు వేల ఎకరాలకు పరిహారం అందించామన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు మరో 600 ఎకరాల అసైన్డ్ భూమల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.  గ్రామాలలోని ప్రజల అభ్యర్ధనల మేరకే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ త్వరగా అందిస్తానన్నారు.

           ప్రాజెక్టుతో నష్టపోతున్న ఆయా కుటుంబాలకు సత్వరం పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. పరిహారం పంపిణీలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ముంపు గ్రామాలలోని ప్రజలను తరలించకుండా నీరు విడుదల చేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. పునరావాస కాలనీలకు తరలించిన తదుపరి ప్రాజెక్టులోకి నీరు విడుదల చేస్తామని ఆయన వివరించారు. ఆర్.ఆర్.ప్యాకేజీ సర్వే పనులు పూర్తయ్యాయని, అందరికీ పరిహార వర్తించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ప్రతినెల వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తామని కలెక్టర్ చెప్పారు. రెండు వారాలకు ఒకసారి  ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను భూసేకరణ ప్రత్యేక కలెక్టర్, ప్రత్యేక ఉపకలెక్టర్లు పర్యటిస్తారని, ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. నిర్వాసితుల జాబితాను సచివాలయాలలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ తదుపరి పరిహారం అందిస్తామన్నారు. తవ్వకంలో దెబ్బతిన్న గ్రహాలకు పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

       ఆయనవెంట మార్కాపురం ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి, భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ ఎస్.సరళవందనం, ప్రత్యేకఉప కలెక్టర్ గ్లోరియా, తహసిల్దార్ కె.రవీంద్రారెడ్డి, ఎంపీడీవో వీరభద్రాచారి, తదితరులు ఉన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: