సన్ ప్లాన్ ఇచ్చినందుకు..

ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్ ఆధ్వర్యంలో...

 ముస్లిం మైనార్టీల ఆత్మీయ కృతజ్ఞత కార్యక్రమం

 (జానో జాగో వెబ్ న్యూస్_  అనంతపురం ప్రతినిధి)     

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయబోతున్న మైనార్టీ సబ్ ప్లాన్ కు కృతజ్ఞతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, వైసీపీ #అనంతపురం_పార్లమెంట్_అధ్యక్షులు #నదీమ్_అహ్మద్ గారి పిలుపు మేరకు ఆయన ఆధ్వర్యంలో వినూత్నంగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం మొదలుకొని శ్రీకాకుళం జిల్లాల వరకు వేలాది మసీదుల్లో శుక్రవారం నాడు ప్రత్యేక ప్రార్థనల అనంతరం జగన్ గారికి ముస్లిం మైనారిటీల తరఫున ఆత్మీయంగా కృతజ్ఞతలు తెలిపారు. 


 


అందులో భాగంగానే గతంలో రాజశేఖర్ రెడ్డి మైనార్టీల సంక్షేమం కొరకు 4% రిజర్వేషన్ అమలు చేసి విద్య, ఉద్యోగ రంగంలో మైనార్టీల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తే నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తమను ఆదుకోడానికి ఈ సబ్ ప్లాన్ అమలు చేస్తున్నారని దీని కోసం ప్రతి మైనార్టీ సోదరుడు జగన్ గారికి కృతజ్ఞతగా ఉంటామని తెలుపుతూ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ, ప్రతి మసీదు బయట ప్లకార్డులతో వైఎస్ జగన్ గారికి #ThankYouCMJaganSir అంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. ఇంత మేలు చేసిన వైఎస్ జగన్ గారు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉంటూ, మరో 30 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

సబ్ ప్లాన్ అమలు చేసినందుకు వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మరియు తన పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం ముస్లిం మైనార్టీలను కలుపుతూ ఈ కార్యక్రమం విజయవంతం  చేసినందుకు ప్రతి మైనార్టీ సోదరుడికి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ & వైసీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు నదీమ్ అహ్మద్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: