ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి

ఏ పీ ఎం.  డి. పిచ్చయ్య


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు  ప్రతినిధి)

ప్రకాశంజిల్లా  తర్లుపాడు మండలం గ్రామ సచివాలయంలో జగనన్న  హౌసింగ్ కాలనీ లబ్ధిదారులను త్వరితగతిన ఇంటి నిర్మాణాలు చేపట్టే విధంగా చూడాలని ఏ పీ ఎం.  డి పిచ్చయ్య సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామపంచాయతీ లోని హౌసింగ్ లబ్ధిదారులు  అందరూ లేఅవుట్లలో అదేవిధంగా సొంత స్థలంలో ఇల్లు మంజూరు అయిన వారు త్వరితగతిన ఇంటి నిర్మాణం చేపట్టే  విధంగా చూడాలని వాలంటీర్ లందరూ తమ పరిధిలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులను త్వరితగతిన ఇంటి నిర్మాణాలు చేపట్టే విధంగా వారందరినీ మొబిలైజ్ చేయాలని హౌసింగ్ డి ఈ, పవన్ కుమార్ తెలిపారు.

 


అదేవిధంగా జగనన్న గృహాలు మంజూరైన లబ్ధిదారుల లో సంఘ  సభ్యులుగా ఉన్నవారికి బ్యాంకు ద్వారా సి ఐ ఎఫ్, శ్రీ నిధి మొదలగు రుణాల ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించి ఇంటి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకొనుటకు మన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ , ప్రాజెక్టు డైరెక్టర్ డి ఆర్ డి ఎ వారి ఆదేశాల మేరకు మహిళా సంఘ సభ్యులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో శేఖర్ రెడ్డి,గ్రామ పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్, వెలుగు సీసీలు, వాలంటీర్లు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: