మార్కాపురం డివిజన్లో,,,

కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సుడిగాలి పర్యటన

ఆకస్మిక తనిఖీలు,  పరుగులు పెడుతున్న అధికారులు,,, 

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ప్రభుత్వ స్కూళ్లలో...కలెక్టర్ అకస్మిక తనిఖీ

విద్యార్థులతో మాటామంతి...భోజన నిర్వాహణపై ఆరా

పాఠశాలలో సౌకర్యాలపై తనిఖీ

సైన్స్,,,గణితం సబ్జెక్టులకు అదనపు క్లాసులు తీసుకోండి


కలెక్టర్ ప్రవీణ్ కుమార్

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

              ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ కార్యక్రమాలలో భాగంగా మార్కాపురం పట్టణంలోమంగళవారంనాడు పలు ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, పాఠశాలలను సందర్శించి తనిఖీల నిర్వహించారు. సైన్స్, గణితం తరగతులు అదనంగా నిర్వహించి విద్యార్థుల ప్రతిభను వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. మార్కాపురం మండలం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మార్కాపురం 15 వ వార్డు సచివాలయం, రామచంద్రాపురం గ్రామ సచివాలయాలను  మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి, ఆరో తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడారు.

కరోనా కర్ఫ్యూ సమయములో గడిచిన మూడు నెలలు ఏమి చేశారు, ఏమి నేర్చుకున్నారని విద్యార్థులను ప్రశ్నించారు. జగనన్న విద్యా దీవెన  కిట్లు పంపిణీపై ఆరా తీశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫాం, బూట్లు ధరించకపోవడంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన వాటిని వాడుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్న పులిహోర, సాంబారు, కోడిగుడ్లు, చిక్కీలు పంపిణీని పరిశీలించారు. ప్రతిరోజు మెనూ అమలు తీరుపై ఆరా తీశారు. వంటగది సరిగా లేకపోవడంతో నాడు- నేడు కార్యక్రమం కింద అభివృద్ధి ఎందుకు చేయలేదని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయాలలో హాజరు పట్టికలు, రికార్డులు సంక్షేమ పథకాల అమలు తీరు ఆయన అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల వివరాలు నోటీస్ బోర్డులో ఉంచడంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మధ్యాహ్న భోజనం పథకం అమలులో అవకతవకలు జరిగితే ఊరుకునేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థులకు అందించే భోజనపదార్థాలలో నాణ్యత ప్రమాణాలు పాటించడంలో రాజి  పడవద్దని ఆయన చెప్పారు. విద్యార్థులకు అందించే భోజన పదార్థాలలో నిర్లక్ష్యం ఉండరాదని ఆయన సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాల్సిన ఆయన తెలిపారు 1940లో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు ప్రస్తుతం పాఠశాలలో 1240 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు ఆయనకు వివరించారు.

          విద్యార్థులంతా అక్టోబర్ నుంచి యూనిఫామ్ తప్పనిసరిగా ధరించి పాఠశాలకు రావాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. యూనిఫాం ధరించి పాఠశాలకు వచ్చేలా విద్యార్థులను చైతన్యపరచాలన్నారు. విద్యార్థులకు చదువులతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని ఆయన స్పష్టం చేశారు. పిల్లలకు కోవిడ్ సోకకుండా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలన్నారు.  భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం శానిటైజర్ వినియోగం నేర్పించాలన్నారు. 1,240 మంది విద్యార్థుల కుటుంబాలలోని వారిని   చైతన్య పరచాలన్నారు. పాఠశాలకు నీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యాలు పరిసరాల పరిశుభ్రతను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు ఎన్ని అమలు అవుతున్నాయో తెలియకుండా విధులు ఎలా నిర్వహిస్తారని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ మందలించారు.

వార్డు సచివాలయం తనిఖీల్లో భాగంగా సిబ్బంది పనితీరునుపై ఆయన ఆరా తీశారు. సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. మాస్క్ ధరించకుండా ప్రజలు తిరుగుతుంటే సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే దుకాణాలు మూత వేయాలని ఆయన హెచ్చరించారు. ప్రజలకు ప్రభుత్వ పాలన అందేలా చూడాలని ఆయన పలు సూచనలు చేశారు. నీటి సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిపాలన పరిస్థితులపై ఆరా తీశారు. ఆయన వెంట మార్కాపురం ఆర్డీఓ కె లక్ష్మి శివ జ్యోతి, ఎంఈఓ రామదాసు నాయక్, మార్కాపురం కమిషనర్ నయీమ్ అహమ్మద్, మండల తహసీల్దార్ ఎలిషా, మరియు పాఠశాల ఉపాథ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, తదితరులు ఉన్నారు.


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

    


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: