ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం
సమాచార హక్కు చట్టం
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
(జానోజాగో వెబ్ న్యూస్-సంగారెడ్డి ప్రతినిధి)
ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం సమాచార హక్కు చట్టం-2005 అని వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం నాడు సంగారెడ్డి శాంతినగర్ లోని టీపీటీఎఫ్ భవన్ లో సమాచార హక్కు చట్టం ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేడు ప్రభుత్వ ఉద్యోగుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం లేకుండ పోయింది. ప్రజలు సమాచారం కొరుతు స. హ ధరకాస్తు పెడితే అధికారులు గడువులోగా స్పందించడంలేదు. స. హ ధరకాస్తుపై మొదటి అప్పీల్ చేసిన మరియు సమాచార కమిషన్ కు రెండోవ అప్పీల్ లేదా ఫిర్యాదు చేసిన స. హ కమిషనర్ల నుండి కూడ సరైన సమాధానం రావడంలేదు. రోజురోజుకు ప్రభుత్వ కార్యాలయాల్లో స. హ చట్టం కనుమర్గు అవుతుంది. కాబట్టి సామాజిక కార్యకర్తలు మరియు స. హ చట్టం ఉద్యమకారులు స. హ చట్టం రక్షణకై ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం స.హా చట్టం రక్షణకై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ, ఉద్దేశపురితంగ సమాచారం ఇవ్వని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, స. హ చట్టంపై అధికారులకు అవగాహన కల్పించే విధంగా మండల, జిల్లా రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలని కోరుతూ, ప్రచార మద్యమాల ద్వారా ప్రచురణ చేపట్టాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సామాజిక మరియు స. హ ఉద్యమకారులకు ధన్యవాదాలు, అని సామాజిక కార్యకర్త, స. హ ఉద్యమకారులు, న్యాయవాది మహమ్మద్ నిజాముద్దీన్ రషీద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు డి. నారాయణ, భాస్కర్, అదిల్, యాదయ్య, శ్రీకాంత్, స. హ ఉద్యమకారులు యం. శ్రీధర్, కృష్ణ, ఆంజనేయులు, రజనీకాంత్, చంద్రమోహన్, బద్రేష్, అసద్ & తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: