మహానేత వైఎస్ఆర్ కు,,, 

నివాళులు అర్పించిన డాక్టర్ ఏలూరి 

 


(జానో జాగో వెబ్ న్యూస్_ విజయవాడ ప్రతినిధి) 

పేదవాడి గుండెచప్పుడు తెలిసిన ప్రజానాయకుడు, మరువాలన్న మరువలేని అపర భగీరధుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మహానేతకు నివాళులు అర్పించారు. హైదరాబాద్ మహానగరంలో రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాణరెడ్డితో కలిసి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏలూరి మాట్లాడుతూ.. మహానేత వైఎస్ఆర్ భౌతికంగా దూరమై పుష్కర కాలం గడుస్తున్నా.. జనం మదిలో, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నారని అన్నారు.  చిరునవ్వులు చిందించే ఆయన రూపం ప్రజల మదినుంచి చెదిరిపోయేది కాదన్నారు ఏలూరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం ఒక్క మహానేతకే సాధ్యమైందని అన్నారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన పశ్చిమ ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా తమకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని కొనియాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, రాజీవ్ ఆరోగ్య శ్రీ, రాజీవ్ గృహకల్ప, పావలా వడ్డీ రుణాలు, రైతులకు ఉచిత కరెంట్ వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఆయన.. ఎంతోమంది ప్రజల గుండెల్లో ఆనందాన్ని నింపాడు. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, మధ్య తరగతి ప్రజల్లో ఆయన విశేషమైన నమ్మకాన్ని ఏర్పరకున్నారని ఏలూరి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: