ఉప్పుతో కరోనాకు చెక్
గొంతునొప్పి తగ్గటానికి ఉప్పునీటిని పుక్కిట పట్టటం తెలిసిందే. కొవిడ్-19 మొదలయ్యాక ఇదింకాస్త ఎక్కువైంది కూడా. కాకతాళీయమో ఏమో గానీ ఉప్పునీరు కొవిడ్ కారక సార్స్-కొవీ-2 వృద్ధిని అడ్డుకుంటున్నట్టూ బ్రెజిల్ అధ్యయనం పేర్కొంటోంది. ఇన్ఫెక్షన్ సోకిన ఊపిరితిత్తుల కణాల్లో ఉప్పు నీటి ప్రభావాన్ని పరీక్షించగా.. వైరస్ వృద్ధిని 88% వరకు తగ్గటం విశేషం. వైరస్ వృద్ధి తగ్గితే జబ్బు తీవ్రతా తగ్గుతుంది. అందుకే ఉప్పు నీటి చికిత్సపై ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇవి విజయవంతమైతే కొవిడ్ నివారణకు, చికిత్సల రూపకల్పనకు బాటలు పడ్డట్టే.
Post A Comment:
0 comments: