తర్లుపాడు ఎంపీపీగా,,,   

ప్రమాణమాణ స్వీకారం చేసిన సూరెడ్డి భూలక్ష్మి

(జానో జాగో వెబ్ న్యూస్_తర్లుపాడు ప్రతినిధి)

 తర్లుపాడు ఎంపీపీగా  సూరెడ్డి భూలక్ష్మిప్రమాణ స్వీకారం చేశారు. తర్లుపాడు ఎంపీపీగా నియమితులైన సూరెడ్డి భూలక్ష్మి తన స్వగృహ నుండి భారీ ర్యాలీతో మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మరియు మైనార్టీ నాయకులు శంషీర్ అలీబేగ్ తో కలిసి తొలుత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, సూరెడ్డి భూలక్ష్మి పూలమాలవేసి అనంతరం ఎంపీడీవో కార్యాలయం వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ గా తరలివచ్చారు.
    తర్లుపాడు ఎంపీపీగా తర్లుపాడు-2 నుండి ఏకగ్రీవంగా ఎంపీటీసీగా గెలిచిన సూరెడ్డి భూలక్ష్మి నీ కలుజువ్వలపాడు-2 ఎంపీటీసీ ఎక్కంటి  తిరుపతిరెడ్డి , చెన్నారెడ్డిపల్లి ఎంపీటీసీ పొట్లపాటి  వెంకటయ్య బలపర చారని, అలాగే కో ఆప్షన్ మెంబర్ గా షేక్ అక్బర్ అలీ   నీ ఎంపీటీసీ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిహెచ్ రమాదేవి తెలిపారు. ఉప ఎంపీపీగా పోతల పాడు ఎం పి టి సి కె.పుణ్యవతిమ్మ ను ఉప ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఎంపీటీసీ అభ్యర్థులను, ఎంపీపీ ని రిటర్నింగ్ అధికారి సిహెచ్.రమాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదిలి సిఐ సుధాకర్ రావు పర్యవేక్షణలో ఇన్చార్జి ఎస్ఐ ఎస్ ఎం హుదూద్ పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎంపీడీవో  ఎస్ నరసింహులు, ఎమ్మార్వో  శైలేంద్ర కుమార్, పోలీస్ సిబ్బంది, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, వైసిపి నాయకులు, మండల ప్రజలు పాల్గొన్నారు.


 


                               

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: