ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

సర్వేపల్లి రాధాకృష్ణన్ కు ఘన నివాళి

సర్వేపల్లి రాధాకృష్ణన్ భావి తరాల కు ఆదర్శనీయుడు

ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

           ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణములో గల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన గురుపూజోత్సవ వేడుకలు కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించడం జరిగింది. భారతరత్న స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది తో కలిసి ప్రధానోపాధ్యాయులు పాఠశాల ఆవరణలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తదనంతరం  కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి గా పనిచేశారనీ, తర్వాత రెండవ భారత రాష్ట్రపతిగా పనిచేసిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు ఉపాధ్యాయునిగా, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గా వివిధ స్థాయిల్లో, వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ఎన్నో రకాలుగా, ఎన్నో రంగాలలో విద్యార్థుల ఉన్నతికి కృషి చేశారన్నారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు ఇచ్చి ఆయనను  సత్కరించింది అన్నారు. అంతేకాకుండా అయన జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 

అటువంటి వ్యక్తిని ఆయన జన్మదినం సందర్భంగా స్మరించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇప్పటి తరం విద్యార్ధులలో సమాజాభివృద్ధికి విలువలు కీలకమని, వారిలో  మానవతా విలువలను పెంపొందించే విషయంలో ఉపాధ్యాయ మిత్రులందరూ పునరంకితం కావాలని..జాతి నిర్మాతగా ఆదర్శవంతంగా రాధాకృష్ణన్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని అంకిత భావంతో నిర్వర్తించాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి నర్రా వెంకటేశ్వర్లు. సబ్బసాని బాస్కరరెడ్డి. వెన్నా నారాయణరెడ్డి. ఒద్దుల వీరారెడ్డి. వల్లపునేని ఆంజనేయులు. ఇంటి వినోద్ కుమార్ తదితర ఉపాధ్యాయులు  ఉపాధ్యాయేతర సిబ్బంది  పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: