రోడ్డెక్కిన ఆశ అంగన్వాడీ వర్కర్లు

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల నిరసన


ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి షేక్ ఖాసీం

(జానో జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

 అఖిల భారత సమ్మెలో భాగంగా ఈ రోజు సీఐటీయూ ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు ఆర్డిఓ కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు అనంతరం ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓ కార్యాలయములో అర్జీ నివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి షేక్ ఖాసీమ్, మరియు సిఐటియు జిల్లా అధ్యక్షులు డి. రఫీ మాట్లాడుతూ  దేశవ్యాప్తంగా అంగన్వాడి, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆయాలు, స్కూల్ స్వీపర్స్ తో పాటు ఇంకా అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాల లో పనిచేసే స్కీం వర్కర్లు లక్షలాదిమంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు నిత్యం సేవలందించే అంగన్వాడి, ఆశాలు, ఆయాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్స్ స్వీపర్స్ చేత  ప్రభుత్వాలు పనులు చేయించుకుంటున్నారు తప్పా వారికి కనీస వేతనాలు అమలు గాని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం గాని లేదని వారి చేత సంవత్సరాలుగా తరబడి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని,  పనికి తగిన వేతనాలు ఇవ్వడంలేదని ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ పట్టించుకోవట్లేదని బాగా పనులు చేస్తున్నారని పొగుడుతున్నారే తప్ప వారి సమస్యలను పరిష్కరించడం లేదని తక్కువ జీతాలతో ఎక్కువ పనులు చేయిస్తున్నారని

సిిఐటియు జిల్లా అధ్యక్షులు డి రఫీ

 ఇది చాలా అన్యాయమని ఇప్పటికైనా స్కీమ్ వర్కర్లు చేసే ఆందోళన పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోవిడితో చనిపోయిన కార్మికులకు 50 లక్షలు బీమా, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కార్మికులకు కనీస వేతనాలు 21,000 వేల రూపాయాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.వారి సమస్యలను పరిష్కరించాలని పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వాలు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నాయని తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ఈ కార్యాక్రమములో అంగన్వాడీ, ఆశా, ఆయాలు, స్కూల్ స్వీపర్స్ ఇతర కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


              

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: