వర్ధంతి కి,,,

టిడిపి నేతల హాజరు


జానో జాగో వెబ్ న్యూస్_ గడివేముల ప్రతినిధి)

గడివేముల మండల టిడిపి నాయకులు బి . సీతారామిరెడ్డి  భార్య బి .రామ లక్ష్మమ్మ వర్ధంతి కి హాజరైన నంద్యాల పార్లమెంటు టిడిపి జిల్లా అధ్యక్షులు గౌరు వెంకట రెడ్డి,  శ్రీశైలం మాజీ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి  గడివేముల మండల టిడిపి  ఇన్చార్జి దేశం  సత్యనారాయణ రెడ్డి, టిడిపి నాయకులు మంచాలకట్ట శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ


 రాష్ట్రంలో పేద ప్రజలు ఏ ఒక్క నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితులు లేవన్నారు ,ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయ్ అని ,గ్రామాలలో ఎక్కడ చూసినా అభివృద్ధి ఏమాత్రం కనబడదని ,ప్రతి గ్రామంలో దాదాపు 30 నుండి 50 వరకు అర్హులైన అవ్వాతాతలకు పింఛను తీసివేయడం జరిగింది అన్నారు .ఇది  ప్రజలందరూ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించుకునేందుకు ఇప్పటి నుండే గ్రామాలలో కార్యకర్తలు ఒక సైనికుల తీవ్రంగా కృషి చేయాలని తెలిపారు . గ్రామాలలో సిసి రోడ్లు ,వాటర్ ట్యాంకులు,కట్టించిన ఘనత కేవలం ఒక టిడిపి పార్టీ అని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బూజు నూరు రామచంద్రా రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు బంగారు షాపు శ్రీకాంత్ టిడిపి కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: