వెలిగొండ సాధన దీక్ష లో భాగంగా...
టిడిపి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
(జానో - జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)
వెలిగొండ సాధన దీక్ష లో భాగంగా ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం కొరకు మార్కాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు పొదిలి మండలం సలక నూతల గ్రామంలో పర్యటిస్తున్న మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిని పొదిలి పోలీస్ శాఖ వారు అరెస్టు చేసి తదుపరి సలక నూతల నుండి పొదిలి వెళ్ళు రహదారిలో వదిలివేశారు.
అంతకుముందు గ్రామంలో స్థానికులు భారీ ఎత్తున వెలుగొండ ప్రాజెక్టు సాధన దీక్ష కు మద్దతు ప్రకటించి కొవ్వొత్తుల ప్రదర్శన చేయబోయారు. దీన్ని అడ్డుకున్న పొదిలి పోలీస్ శాఖ వారు మాజీ శాసనసభ్యులు వారిని నిర్బంధించి తదుపరి జాతీయ రహదారి పై వదలి వేశారు. దీనిపై సలక నూతల గ్రామ ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: