భూ అక్రమాల కేసులో...

రిటైర్డ్ తాసిల్దార్ విద్యాసాగర్ అరెస్ట్

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఇటీవల ప్రకాశం జిల్లాలోని మార్కాపురం అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని మార్కాపురం మండలములో కొందరు రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా వుంటూ సహకరించే  విఆర్వోలను, తాసిల్దార్ లను డిప్యూటీ తాసిల్దారు లను, ఇతర రెవెన్యూ అధికారులను పోస్టింగ్ లు వేయించుకొని భూ అక్రమాలకు తెరలేపారని, అత్యంత విలువైన సుమారు యేడు వందల ఎనభై ఆరు ఎకరాల ప్రభుత్వ భూములను కొందరి రాజకీయ నాయకుల ఆదేశాలతో,


 ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్


విశ్రాంత తహసిల్దార్ విద్యాసాగర్
మరి కొందరి అండదండలతో వారికి అనుకూలమైన వారికి కట్టబెట్టిన వైనంలో 13 మంది విఆర్వో లను సస్పెన్షన్ చేయడంతో  పాటు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ను శాశ్వతంగా ఉద్యోగ బాధ్యతల నుండి  తొలగించడం జరిగింది. పరోక్షంగా వీటన్నిటికి మూలకారణమైన విశ్రాంత తహసిల్దార్ విద్యాసాగర్ పై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ , జాయింట్ కలెక్టర్ మురళి,యు విచారణ అధికారి సరళ వందనం ఆధ్వర్యములో జరిగిన ఈప్రక్రియకు పట్టణములోని మరియు పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.  తన స్వలాభం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసి అర్హత లేని వ్యక్తులకు అక్రమంగా మ్యుటేషన్ చేసి  పాస్ బుక్ ల కొరకు రెకమెండ్ చేసిన మార్కాపురం రిటైర్డ్ తాసిల్దార్ విద్యాసాగర్ ను అరెస్ట్ చేసినట్లు ఈ రోజు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డి.ఎస్.పి. కిషోర్ కుమార్ తెలిపారు. 


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: