వర్థంతికి ఆహ్వానించి రాజకీయాలు మాట్లాడుతారా

కాంగ్రెస్ నేత జి.నిరంజన్ 


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

వై.ఎస్.రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి రోజు రాజకీయాల కతీతంగా ఆత్మీయ సమ్మేళనమని అందరినీ ఆహ్వానించిన రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ రాజకీయాలు మాట్లాడటం తన బిఢ్ఢలను ఆశీర్వదించమని కోరడం ఆశ్చర్యకరంగా ఉందని టీ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణా లో రాజన్న రాజ్యము తేవాలని షర్మిల ముందుకు వెళుతోందని, తన బిడ్డను ఆశీర్వదించాలని సంస్మరణ సభకు వచ్చిన వారికి విఙప్తి చేశారు. మేము ఎవరినీ మోసము చేయలేదు, ఎవరికీ ద్రోహం చేయలేదని చెప్పే ఆమెకు ఇది మోసము కాదా? దగా కాదా? అని ప్రశ్నిస్తునాను. వివిధ పార్టీలో ఉన్న వారిని ఆత్మీయ సమ్మేళనము పేరు మీద పిలిచి తన బిడ్డలకు రాజకీయముగా ఆశీర్వదించమనడము దగా కాదా? అని ప్రశ్నిస్తున్నాను. ఇరు రాష్ట్రాలలో ఏ నలుగురు కూడినా ఆ ఒక్కడు బ్రతికుంటే ఇలా జరిగేది కాదనుకుంటున్నారని విజయమ్మ అంటున్నారు. ఏమి జరిగేది కాదో ఆమె చెప్పాలి. తెలంగాణా ప్రజల చిరకాల వాంఛ నెరవేరేది కాదా..? రాష్ట్రము రెండుగా విడిపోయి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రము ఏర్పడేది కాదా ? స్పష్టం చేయాలి. షర్మిల గారూ చెప్పినట్లు వైసార్ ఇక్కడి ప్రజలు మన కుంటుంబమని ఆమె గుండె పై విల్లు రాసి ఉంటే, మనది కాంగ్రెస్ కుంటుంబమని కూడా రాసి ఉంటారు. వైయస్ సి.ఎం గా అందించినది కాంగ్రెస్ పాలన అని మరువ కూడదు. వైఎస్ వలననే తాను ప్రధాని అయ్యానని మన్మోహన్ సింగ్ తనతో చెప్పారంటున్న విజయమ్మ , మరి ఎవరి వలన, ఏ పార్టీ వలన వైయస్ సి.ఎం అయ్యారో చెప్తే బాగుండేది. వారి కోసం కొట్లాడుతాయని మాటిస్తున్నాని అంటున్న ష ర్మిలా, మా కోసం, తెలంగాణా ప్రజల కోసం ఎవరో వచ్చి కొట్లాడిల్సిన అవసరం లేదు, మా కోసం కొట్లాడే సత్తా మాకున్నదని గుర్తిస్తే మంచిది. విజయమ్మ, వారి పిల్లల కుటుంబము వైసార్ బాటలో నడిచేదైతే కాంగ్రెస్ కు ద్రోహము చేసే వారు కాదు. తల్లిగా విజయమ్మ తన బిడ్డలను కాంగ్రెస్ పట్ల నిబద్దతతో ఉండే విధముగా చూసే వారు. పిల్లలకు చెప్పలేక, నియంత్రించ లేక , వారిపై ప్రేమ తో విజయమ్మ వైసార్ బాటను వదిలి పయనిస్తున్నారు. ఇది వైసార్ ఆత్మను క్షోభింప చేస్తుంది. అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: