సీఐ కొండారెడ్డి నీ వెంటనే బర్తరఫ్ చేయాలి
భూ కబ్జాదారులు కొమ్ముకాస్తున్న మైదుకూరు ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలి
అక్బర్ భాషా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా
(జానో - జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప లో మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చాగలమర్రి గ్రామానికి చెందిన అక్బర్ బాషా అనే ఒక ముస్లిం కుటుంబం తన భార్య ఇద్దరు ఆడపిల్లలు తో కలిసి
సామూహిక ఆత్మహత్య చేసుకుంటున్నానమని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడం
చాలా బాధాకరమని ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా పేర్కొన్నారు. ఈ ఘటనకు, ఆత్మహత్యలుచేసుకునేల భయకంపితులను చేసిన మైదుకూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి ని తన ఉద్యోగ బాధ్యతల నుంచి పూర్తిగా బర్తరఫ్ చేయాలని, అలాగే భూ కబ్జాదారుడైన మండల వైసీపీ నాయకుడు ముఖ్యమంత్రి బంధువైన తిప్పిరెడ్డి కొమ్ముకాసిన అధికార పార్టీ మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
వైసీపీ కార్యకర్త అయిన అక్బర్ బాషా తన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన రిజిస్టర్ భూమి సుమారు 1.5 ఎకరాల భూమిని కబ్జాచేసి, చంపుతామని బెదిరించిన వైసిపి నాయకులు పై చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ గారినీ
సదరు బాధితుడు అక్బర్ బాషా తన కుటుంబ సమేతంగా వెళ్లి మొరపెట్టుకోగా వీరికి విచారణ చేసి న్యాయం చేయమని సదరు ఎస్పీ గారు మైదుకూరు సిఐ కొండారెడ్డికి రిఫర్ చేయడం జరిగింది.
ఈ సందర్భంలో లో ఎస్ పి గారి ఆదేశానుసారం న్యాయం చేస్తానని ముందు మాట ఇచ్చిన సీఐ కొండారెడ్డి రాజకీయ ఒత్తిళ్లతో ఎస్ పి గారి ఆదేశాలను సైతం దిక్కరించి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆదేశాలతో బాధితులైన అక్బర్ బాషా కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించిఆయన కుటుంబ సభ్యుల్ని, తనతోపాటు వచ్చిన గ్రామ పెద్దలు ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి రక్త గాయాలు రక్త గాయాలు అయ్యే విధంగా తీవ్రంగా లాఠీలతో కొట్టి తుపాకీని గురిపెట్టి ఎన్ కౌంటర్ చేస్తానని సిఐ కొండారెడ్డి బెదిరించడం రాష్ట్రంలో తాలిబన్ల రాజ్యా పాలన తలపిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు, అయ్యా నేను వైసీపీ కార్యకర్త ను గత ఎన్నికల్లో నేను నా కుటుంబం మా బంధువర్గం అంతా మీకు ఓట్లు వేసి చావని, మాకు న్యాయం చేయమని బాధితులైన అక్బర్ బాషా స్థానిక శాసనసభ్యులు రఘురామిరెడ్డినీ ప్రాధేయపడినా ఏమాత్రం కనికరం లేకుండా భూకబ్జా దారు అయినా మండల వైసీపీ నాయకుడు తిప్పి రెడ్డి కి ఎమ్మెల్యే వత్తాసు పలకడం దుర్మార్గమైన చర్య అని సైదా అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి త్వరితగతిన స్పందించాలని బాధిత అక్బర్ భాషా కుటుంబానికి
అధికార పార్టీ నాయకుల నుండి పోలీసుల నుండి తగిన రక్షణ కల్పించాలని, కబ్జాకు గురైన తన వ్యవసాయ భూమిని తనకు ఇప్పించి న్యాయం చేయాలని, భూ కబ్జాదారులు పై, వారి కొమ్ముకాసిన శాసనసభ్యులపై ప్రభుత్వపరంగా, పార్టీపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు, అలాగే
అలాగే రాష్ట్రంలో మైనారిటీ హక్కుల ను కాపాడటం కోసం ఏర్పాటుచేసిన రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ బాధిత అక్బర్ బాషా కుటుంబాన్ని పరామర్శించి వారికి తగిన న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని , నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యల మర వకముందే సీఎం సొంత జిల్లాలో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని
అక్బర్ భాషా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనికాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా అన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: