డ్వాక్రా మహిళలకు తీపి కబురు..
వచ్చే నెలలోనే అకౌంట్లో ఆసరా డబ్బులు
(జానో జాగో వెబ్ న్యూస్_విజయవాడ బ్యూరో)
ప్రభుత్వం చేపడుతున్న ఈ అతిపెద్ద కార్యక్రమం మండలం యూనిట్‌గా జరుగుతుందన్నారు. దాదాపు రూ.6,500 కోట్లు వైఎస్సార్ ఆసరా కింద ఇస్తున్నామని.. దాదాపు 80 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలు లబ్ధిపొందుతారని చెప్పారు.
*అక్టోబర్ 7 నుంచి రెండో విడత ఆసరా*
*రాష్ట్రంలో 80లక్షలమందికి లబ్ది*
ఏపీలో డ్వాక్ర మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. అక్టోబర్ 7 నుంచి వరుసగా 10 రోజుల పాటు విజయ దశమి కానుకగా రెండో విడత ఆసరా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు.
స్పందన కార్యక్రమంలో భాగంగా కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 7 నుంచి 10 రోజుల పాటు ఆసరా పథకంపై నిర్వహించే అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొంటారని చెప్పారు.
ఆ రోజుల్లో ఆసరా చెక్కుల పంపిణీయే కాకుండా ఆసరా, చేయూత, దిశ ద్వారా మహిళా సాధికారతకు ఏ విధంగా అడుగులు వేశామో ప్రజలకు వివరిస్తారన్నారు.
ఆసరా, చేయూత ద్వారా జీవితాలను మెరుగు పరుచుకున్న వారి విజయాలను మహిళలకు వివరిస్తారని తెలిపారు. ఈ పథకాల ద్వారా వారి జీవితాలను ఎలా మార్చుకోవచ్చో కూడా వివరిస్తారని..
ప్రభుత్వం చేపడుతున్న ఈ అతిపెద్ద కార్యక్రమం మండలం యూనిట్‌గా జరుగుతుందన్నారు. దాదాపు రూ.6,500 కోట్లు వైఎస్సార్ ఆసరా కింద ఇస్తున్నామని.. దాదాపు 80 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలు లబ్ధిపొందుతారని చెప్పారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. అక్టోబర్ 19న జగనన్న తోడు కార్యక్రమం ఉంటుంది. దీని కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందజేస్తామన్నారు.
అక్టోబర్ 26న రైతులకు ‘వైఎస్సార్ సున్నావడ్డీ రుణాలు’ కార్యక్రమం ఉంటుందని.. దీంతో పాటు ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత అమలు చేస్తామన్నారు.
పట్టణాలు, గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ‘క్లాప్’ అక్టోబర్ 1న ప్రారంభం అవుతుందన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: