ప్రాజెక్టు కు నికరజలాలు వద్దా,,,

మిగులు జలాలే ముద్దా... 

నికర జలాలపై స్పందించరేం..

వైసిపి జిల్లా నాయకులు సమాధానం చెప్పాలి

మార్కాపురం మాజీ  ఎమ్మెల్యే నారాయణ రెడ్డి.

 


 (జానో జాగో వెబ్ న్యూస్_, మార్కాపుర ప్రతినిధి)

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గం, కొనకనమిట్ల  మండలం, నాగిరెడ్డిపల్లి   గ్రామం,....               శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్  సాధన దీక్ష లో భాగంగా గ్రామంలో మార్కాపురం మాజీ శాసనసభ్యులు  కందుల నారాయణ రెడ్డి గారు  శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజలను చైతన్యవంతులు చేయుటకు గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈరోజు కొనకనమిట్ల మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో పర్యటించారు.  ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ గతంలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ యొక్క రెండవ టన్నెల్ ను వేలాది మంది ప్రజలను సమీకరించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించారని గుర్తుచేశారు.

ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తరలించుటకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ పై ఒత్తిడి తెచ్చి ఈరోజు నాగిరెడ్డి పల్లి లో శాంతియుతంగా గ్రామస్తులు కొవ్వొత్తుల ప్రదర్శన చేయబోగా వారిని పోలీస్ శాఖ వారు భయబ్రాంతులకు గురిచేసి తద్వారా నికర జలాల ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి ఆ జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు తరలించాలని చూస్తున్నారని తెలిపారు.శాంతియుతంగా గ్రామస్తులు చేయబోయిన కొవ్వొత్తుల ప్రదర్శన ఆపటం దుర్మార్గమని తెలియజేశారు.

 ఓట్లు వేయించుకున్న ఈ జిల్లా నాయకులకు  వెలుగొండ ప్రాజెక్టు నికర జలాలు అవసరం లేదా లేక వెలిగొండ నీళ్లే అవసరం లేదా అని ప్రశ్నించారు. అప్పటి మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తద్వారా  కృష్ణా డెల్టాకు 120 టీఎంసీల నీరు గోదావరి నుండి తరలించే వీలు కల్పించాలని తెలియజేశారు. అందువలన తక్షణమే శ్రీశైలంలో నిలువ చేయుచున్న ఆ 120 టీఎంసీల నీటిని వెలిగొండ ప్రాజెక్టు కు 42 టీఎంసీల నికర జలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా వెలుగొండ ప్రాజెక్ట్ సాధన లో భాగంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని అభ్యర్థించారు. 

ఈ  కార్యక్రమంలో కొనకనమిట్ల మండల పార్టీ అధ్యక్షులు కనకం నరసింహారావు గారు,  తర్లుపాడు మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి గారు, మార్కాపురం మండల పార్టీ అధ్యక్షులు జవాజి రామానుజుల రెడ్డి, పొదిలి ఏఎంసీ మాజీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య , మార్కాపురం ఏఎంసి మాజీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, తర్లుపాడు మాజీ ఎంపీపీ పులి వేముల ఏసు దాసు,  కొనకనమిట్ల తెలుగుదేశం నాయకులు ఎం. బాబు రావు , తర్లుపాడు మండల తెలుగుదేశం నాయకులు సాదం  వీరయ్య, పి గోపీనాథ్ చౌదరి, మార్కాపురం మండల తెలుగుదేశం నాయకులు దూదేకుల మస్తాన్,  తాండ్ర వెంకటేశ్వర్లు చౌదరి,  మార్కాపురం కౌన్సిలర్స్ నాలి కొండయ్య , చిలకపాటి చెన్నయ్య,  మాజీ కౌన్సిలర్ సయ్యద్ గఫార్ , పఠాన్ ఇబ్రహీమ్, మైనారిటి నాయకులు గులాబ్, హుస్సేన్ ఖాన్, చక్కపెట్టల జిలాని, నాగిరెడ్డిపల్లి తెలుగుదేశం నాయకులు భీమా రెడ్డి, దశరథ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి. గ్రామ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు   పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


  


           

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: