రెవిన్యూ లో అక్రమాలకు పరోక్ష కారణమైన,,,

రాజకీయ తిమింగలాల పై,,,

క్రిమినల్ కేసులు నమోదు చేయించండి

కాంగ్రెస్ నేత  షేక్ సైదా డిమాండ్

ఏపీసీసీ అధికార ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ సైదా
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

రెవిన్యూ లో అక్రమాలకు పరోక్ష కారణమైన రాజకీయ తిమింగలాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏపీసీసీ అధికార ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ సైదా డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మార్కాపూరం మండలం లో  అత్యంత విలువైన సుమారు ఏడు వందల ఎనభై ఆరు ఎకరాల ప్రభుత్వ భూములను అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో వారి కుటుంబ సభ్యులకు కట్టబెట్టి 13 మంది విఆర్వోలు, ఒక గ్రామ సచివాలయ సర్వేయర్ సస్పెన్షన్ చేయడంతోపాటు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ను శాశ్వతంగా ఉద్యోగ బాధ్యతలను తొలగించడం, వీటన్నిటికీ మూల కారణమైన అవినీతి తిమింగలం రిటైర్డ్ తాసిల్దార్ విద్యాసాగర్ పై క్రిమినల్ కేసు నమోదు సిఫార్సు చేసిన ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జాయింట్ కలెక్టర్ మురళికి, విచారణాధికారి సరళ వందనంకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ సైదా నేడు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మార్కాపురం, తర్లుపాడు, పొదిలి ,కొనకనమిట్ల,  మండలాల్లో  కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయని ఆ భూములను కాజేసేందుకు గత ప్రభుత్వ హయాంలో కొంత ప్రయత్నం జరిగిందని, అయితే జగన్ ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు తమకు అడుగులకు మడుగులొత్తే వీఆర్వోలను, తాసిల్దార్ లను డిప్యూటీ తాసిల్దారు లను, ఇతర రెవెన్యూ అధికారులను పోస్టింగ్ లు వేయించి ఈ నియోజకవర్గంలో భూ అక్రమాలకు తెరలేపారని, నిన్న కలెక్టర్ గారు సస్పెండ్ చేసిన రెవెన్యూ అధికారుల జాబిత నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన వీఆర్వోలను సస్పెండ్ కే పరిమితం చేయడం సమంజసం కాదని వారి మీద అలాగే ఈ అక్రమాలకు పరోక్ష కారకులైన, సూత్రధారులు అయినా అధికార పార్టీ ముఖ్య నాయకుల మీద క్రిమినల్ కేసు నమోదు చేసి శిక్షించాలని,  సైదా అన్నా రు, జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 56 మండలాలు ఉంటే ఒక్క మార్కాపూరం అసెంబ్లీ నియోజకవర్గం లోని 4 మండలలు అయినా మార్కాపురం, తర్లుపాడు,కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో ఇలాంటి భూ అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి భూ బకాసురులు రెచ్చిపోయి ప్రభుత్వ భూముల్ని,చెరువులను, పంట కాలువల ను, దేవస్థానం భూముల్ని, ఈనామ్ భూముల్ని, స్మశానాలను,ప్రభుత్వ వ్యవసాయ శాఖ నర్సరీలను, పేదల తమ కష్టార్జితంతో రూపాయి ,రూపాయి కూడా పెట్టి కొనుగోలు చేసిన పేద, మధ్య తరగతి,   ఏ అండలేని కుటుంబాల ఇళ్ల స్థలాలను సైతం ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి కారకులు ఎవరు? మార్కాపురం నియోజకవర్గంలో ల్యాండ్, శాండ్,మైన్, వైన్ మాఫియా విజృంభిస్తున్న "సెబ్" అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం లోఆంతర్యం ఏమిటి?  "రాజు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడిచిన చందంగా" మార్కాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారుల పనితీరు ఉంది. నియోజకవర్గ పరిధిలోని పొదిలి, కొనకనమిట్ల ,తర్లుపాడు మండలాల్లో ప్రభుత్వ భూముల అక్రమాలు మీద జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి  విచారణ జరిపించాలని, అలాగే పొదిలి మండలం లో ముఖ్యంగా పొదిలి పట్టణంలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు పెద్ద చెరువు ,చిన్న చెరువు, పంటకాలు వలు, చెరువు అలుగు వాగులు,  ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టిన పట్టించుకోని ఆనాటి రెవెన్యూ తాసిల్దార్లు విద్యాసా గరుడు, పద్మావతి, నాగేశ్వరరావు వారితో కలిసి పని చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వీఆర్వోలు, డిప్యూటీ తాసిల్దారు లు, సర్వేయర్ ల మీద , ఆనాటి నుండి ఈనాటి వరకు భూ అక్రమాలలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరి మీదచర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కందుకూరు సబ్ కలెక్టర్ కలిసి విన్నవించనున్నట్లు సైదా తెలిపారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: