వ్యవసాయం దండగన్న మేధావి పార్టీలో ఉంటూ,,, 

రైతుల గురించి మాట్లాడతారా..? 

వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్_విజయవాడ బ్యూరో)

కొంతకాలంగా వెలిగొండ ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. టీడీపీ నేతలకు రైతులను నట్టేటా ముంచాలనే ఆలోచనే తప్పా మేలుచేద్దామన్న సదభిప్రాయం లేదని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టుని KRMB పరిధిలోకి తీసుకురావడంలో నిర్లక్ష్యం వహించామని త్వరలోనే బోర్డు పరిధిలోకి తెచ్చి నోటిఫికేషన్ లో చేరుస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ ఇదివరకే చెప్పినా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు లాంటి మహామేధావిని సమర్ధిస్తూ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో కరెంటు బిల్లులు కట్టలేదని పల్లెలపై దాడులు చేసి రైతులను పోలీసు స్టేషన్లలో పెడితే.. కరెంటు బిల్లుల కోసం రైతులను, వారి భార్యలను పోలీసు స్టేషన్లకు ఈడ్చి, మహిళల మంగళసూత్రాలను సైతం తాకట్టు పెట్టించిన ఘనుడు చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు అలాంటి వ్యక్తి దగ్గర పనిచేస్తూ రైతులకు అండగా నిలుస్తామని టీడీపీ నేతలు అంటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు ఏలూరి.. వెలిగొండ ప్రాజెక్టు పనులు చేయకుండా పశ్చిమ ప్రకాశం రైతులను నట్టేట ముంచి.. ఈనాడు మా హయాంలో ప్రాజెక్టు పనులు శరవేగంగా చేయిస్తుంటే టీడీపీ నేతలు శకునిలాగా మారి దుష్ప్రచారం చేస్తూ.. వెలిగొండ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవరించడం దారుణమని అన్నారు. ఇకనైనా టీడీపీ నేతలు వెలిగొండ విషయంలో తమ వైఖరిని మార్చుకోవాలని ఏలూరి రామచంద్రారెడ్డి హితవు పలికారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: