స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించే వరకు,,, 

పోరాడుతాం... మా పోరాటం ఆగదు

చనిపోయిన స్కీం వర్కర్లకు 50 లక్షల రూపాయల బీమా అందజేయాలి

సి ఐ టి యు

(జానో జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

మండల కేంద్రం అయిన గడివేముల లో స్కీం వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. సమ్మెలో భాగంగా కొత్త బస్టాండ్ సర్కిల్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో నాగమణి గారికి వారి వినతుల తో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్ల అందరికీ 21 వేల రూపాయల కనీస వేతనం అందజేయాలని కోరారు. కోవీడ్ విజృంభించిన సమయంలో స్కీం వర్కర్స్ అందరూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేశారని ప్రజల ప్రాణాలు కాపాడడంలో స్కీమ్ వర్కర్ల అందరూ చాలా మంది చనిపోయారని


చనిపోయినయిన స్కీం వర్కర్లకు 50 లక్షల రూపాయల భీమా వారి కుటుంబాలకు అందజేయాలని అలాగే స్కీం వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ పింఛన్ సౌకర్యం కల్పించాలని వారు తెలిపారు .అనంతరం కొత్త బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి తమ డిమాండ్లను వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు రాములమ్మ , సువర్చల మ్మ , మరియు మండలంలోని స్కీం వర్కర్లు ,సిఐటియు అభిమానులు సభ్యులు అందరూ పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: