నకిలీ పోలీసుల అరెస్ట్

రూ.47 లక్షల నగదు..రెండు వాహనాలు, కత్తి స్వాధీనం


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

          ప్రకాశం జిల్లాలోని ప్రధాన హైవే పదహారో నెంబరు జాతీయ రహదారిపై పోలీసుల పేరుతో  నగదు దోచుకెళ్లిన నకిలీ పోలీసులను ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.47 లక్షల నగదుతో పాటు రెండు వాహనాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుజిల్లాకు చెందిన నాగరాజు, శ్రీనివాసులు, గోపి కృష్ణ, సుబ్బారాయుడు తో పాటు కడప జిల్లాకు సుధాకర్, కళ్యాణ్, ప్రసాద్ లు ముఠాగా ఏర్పడి హైవే దొంగతనానికి పధకం సిద్దం చేశారు.

 ఈ క్రమంలోనే నెల్లూరుకు చెందిన బంగారం వ్యాపారి చిరంజీవి తన కారులో బంగారం కొనుగోలు చేయడానికి మరో ఇద్దరితో కలిసి విజయవాడకు వెళుతున్న సమయంలో  గుడ్లూరు శాంతినగర్ ప్రాంతానికి రాగానే కారు ఆపి  భారీ మొత్తంలో అక్రమ డబ్బును తీసుకువెళుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని, వెంటనే డీఎస్పీ కార్యాలయానికి రావాలని హెచ్చరించారు. లేని పక్షంలో కేసులేకుండా విడిచి పెట్టడానికి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కారులో వున్న 50 లక్షల రూపాయల బ్యాగ్ ను తీసుకొని ఇన్నోవా కారులో పారిపోయారు. జరిగిన సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టి నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 47లక్షల రూపాల నగదును స్వాదీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మాలికా గార్గ్ తెలిపారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: