పేదలపై వరాల జల్లు

గృహ రుణాలపై వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌

మైనార్టీలకు సబ్ ప్లాన్...సూత్ర ప్రాయ నిర్ణయానికి ఆమోదం

మహిళా ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీ కింద రూ.35వేల రుణం

రెండో విడత ఆసరాకుకు గ్రీన్ సిగ్నల్

పెద్ద మొత్తంలో దానం చేస్తే...స్కూళ్లు, కాలేజీలకు  దాతల పేర్లు

ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

సమీప భవిష్యత్తులో కీలకమైన ఎన్నికలు లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేబినేట్ బేటీలో పేద వర్గాలపై వరాల జల్లు కురిపించేలా నిర్ణయాలు తీసుకొంది. ఎవరూ ఊహించని విధంగా పేదల గృహ లబ్ధిదారులపై కరుణ చూపించింది. మైనార్టీ వర్గాల సబ్ ప్లాన్ కోసం సూత్ర ప్రాయ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ దాదాపు 39 అంశాలపై చర్చించి వాటిని ఆమోదించింది.వివిధ ప్రభుత్వాల హయాంలో ఏపీ హౌజింగ్‌ కార్పొరేషన్‌ వద్ద నుంచి లోన్లు తీసుకున్న పేద వర్గాలకు ఊరట కలిగించేందుకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ సౌకర్యం తీసుకొచ్చింది.

పేదల గృహ రుణాలపై వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి  పేర్ని నాని తెలిపారు. 1983 నుంచి 2011 ఆగష్టు 15 మధ్య వివిధ ప్రభుత్వాల ద్వారా పొందిన ఇంటి స్థలాలపై లోన్లు తెచ్చుకునే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని వారి సొంత ఆస్తిగా మార్చి ఇచ్చేందుకు తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా 46,61,737 మంది లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేల వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ సౌకర్యం పొందవచ్చన్నారు. మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల పరిధిలోని వారయితే రూ.20 వేలు చెల్లించి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకోవచ్చని తెలిపారు. 

అలాగే హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకుని, ఒకవేళ ఆ ఇల్లు ఎవరికైనా అమ్మిన పక్షంలో.. ప్రస్తుతం ఆ ఇంటిని కొనుగోలుచేసిన, అర్హత ఉన్నవారు గ్రామీణ ప్రాంతాలలో రూ. 20వేలు, మున్సిపాల్టీల్లో రూ.30వేలు, కార్పొరేషన్‌లలో రూ.40వేలు వన్‌ టైం సెటిల్‌ మెంట్‌ కింద కడితే సరిపోతుంది. అలాగే హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకోకుండా ఇల్లుకట్టుకుంటే.. వారికి ప్రభుత్వం ఉచితంగా హక్కులు కల్పిస్తుంది. వన్‌టైం సెటిల్‌మెంట్‌ ద్వారా దాదాపు 46 లక్షలమందికిపైగా లబ్ధి పొందుతారు. మహిళా ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీ కింద రూ.35వేల చొప్పున అదనుపు రుణా సహాయం చేస్తారు. ఈ రుణం పై 3 శాతం స్వల్ప వడ్డీ ఉంటుంది. మిగతా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

రెండో విడత ఆసరాకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2021–22 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాలకు ఆసరా వర్తింపు చేయనున్నది. ఆస్పత్రులు, స్కూళ్లలో చేపడుతున్న నాడు – నేడు కార్యక్రమాలకు సహాయం అందించిన దాతల పేర్లు పెట్టేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన విధివిధానాలకు కేబినెట్‌ ఆమోదించింది. కనెక్ట్‌ టు ఆంధ్రా కార్యక్రమం కింద నాడు – నేడు కోసం ముందుకు వచ్చిన దాతలు  రూ. 50 లక్షలు ఇస్తే శాటిలైట్‌ఫౌండేషన్‌ స్కూలుకు పేరు, రూ.1 కోటి దానం చేస్తే ఫౌండేషన్‌ స్కూలుకు, రూ.3 కోట్లు ఇస్తే హైస్కూల్‌కు దాతల పేర్లు, రూ.1 కోటిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, రూ. 5 కోట్లు ఇస్తే సీహెచ్‌సీకి, రూ.10 కోట్లు ఇస్తే ప్రాంతీయ ఆస్పత్రికి దాతల పేర్లు పెడతామన్న ప్రభుత్వం, ఒక కాలేజీలో కాని, స్కూళ్లోకాని క్లాస్‌రూం, అదనపు క్లాస్‌రూం, హాస్టల్, లైబ్రరీ, గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణానికి అయ్యే ఖర్చును నూటికి నూరుశాతం దానం చేస్తే సంబంధిత నిర్మాణాలకు 20 ఏళ్లపాటు దాతల పేర్లు పెడతామంటూ విధివిధినాల్లో ప్రభుత్వం పేర్కొంది.

డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ 1940 చట్టం సవరణకు కేబినెట్‌ ఆయోదించింది. కల్తీలు, నకిలీలను అడ్డుకునేందుకు చట్ట సవరణ చేసింది. తప్పిదాలకు పాల్పడితే లైసెన్స్‌ల రద్దు, భారీ జరిమానాలు విధించనున్నది. వైయస్సార్‌ జిల్లా, రాయచోటి మండలం మాసాపేట గ్రామంలో యోగివేమన యూనివర్సిటీ పీజీ సెంటర్‌ ఏర్పాటుకోసం 53.45 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకొంది. రాయలసీమ కరవు నివారణ లో భాగంగా హంద్రీనీవా సుజలస్రవంతి ఫేజ్‌–2లో భాగంగా పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ను 79.6 కి.మీ. నుంచి 220.35 కి.మీ వరకూ రూ.1929 కోట్లతో విస్తరించనున్న పనులకు ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలనుంచి మినహాయింపునకు కేబినెట్‌ ఆమోదించింది.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

            


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: