27న భారత్ బంద్ ను,,,
జయప్రదం చేయండి..
ఎమ్.పి.జె. జిల్లా అధ్యక్షులు -ఎస్.కే.ఖాసిమ్
(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న జరిగే భారత్ బంద్ ను విజయ వంతం చేయాలని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం కోరారు. రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా ఎం.పి.జె ప్రధాన కార్యాలయములో జరిగిన ముఖ్య నాయకుల సమావేశములో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాలు అవలంబిస్తూ ప్రజలను, రైతులను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నది.
పెట్రోల్, డీజిల్ మరియు నిత్యా వసర వస్తువుల ధరలను పెంచుతూ సామాన్యులపై తీవ్ర భారం మోపుతుందని ఆరోపించారు. ఢిల్లీలో తొమ్మిది నెలలుగా రైతులు పోరాటం చేస్తున్నా, ఈ రోజు వరకు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు విసుగు పుట్టి ఈ నెల 27న పంతొమ్మిది ప్రతిపక్ష పార్టీలు కలిసి భారత్ బందుకు పిలుపు ఇవ్వటం జరిగింది. కావున 27వ తేదీన జరగబోవు భారత్ బందును జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమము లో జిల్లా ఉపాధ్యక్షులు గఫార్, కార్యదర్శి సతీష్ చౌదరి, కోశాధికారి హకీమ్, నాయకులు ఖాదర్, అన్వర్, రఫీఖ్, అహ్మద్, అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: