సెప్టెంబర్ 24న స్కీమ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మెకు,,,
రైతు, వ్యకాస సంపూర్ణ మద్దతు
(జానో జాగో వెబ్ న్యూస్_ హైదరాబాద్ బ్యూరో)
సెప్టెంబర్ 24న జరుగుతున్న స్కీమ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 22న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ, ఆశ, వంటి స్కీముల్లో పని చేస్తున్నా కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత , పీఎఫ్, ఈఎస్ఐ , గ్రాట్యుటీ, పెన్షన్లు వంటివి అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమదోపిడీ చేస్తున్నాయని, బడ్జెట్ కేటాయింపుల్లో వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించడంలో కార్మికుల పట్ల అత్యంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. మరోపక్క వంట ఏజెన్సీలకు నెలల తరబడి బిల్లుల చెల్లింపులో జాప్యం వలన అధిక వడ్డీలు కట్టలేక అప్పుల పాలవుతున్న పరిస్థితి కార్మికులకు ఉందని, రోజుకి ఆరేడు గంటల పని చేస్తున్నా గౌరవ వేతనం పేరుతో 1000 రూపాయలు మాత్రమే ఇచ్చి కార్మికుల్ని బానిసలుగా పని చేయించుకోవడం అన్యాయమని, సామాజిక భద్రత పెన్షను పనిలో అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నా ఎలాంటి వైద్య సౌకర్యాలు కల్పించడం లేదని, అనేక సందర్భాల్లో ప్రథమ చికిత్స కూడా అందించే పరిస్థితి లేదని పాఠశాలల్లో వంటశాలలు, వంటపాత్రలు, మంచినీరు, గ్యాస్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు వున్నా ఎలాంటి వైద్య బీమా సౌకర్యం లేదు. సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 24 న స్కీం వర్కర్ల దేశ వ్యాప్త సమ్మెకు మద్దతుగా రైతు, వ్యకాస నాయకులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
సెప్టెంబర్ 24న స్కీమ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మెకు,,, రైతు, వ్యకాస సంపూర్ణ మద్దతు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: