ఒక దెబ్బకు రెండు పిట్టలు

కాంగ్రెస్ సరికొత్త వ్యూహం...టార్గెట్ 2024 ఎన్నికలు

రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి

జనాద్దరణ గల నేతలకు పట్టం

సీనియర్ల వాదనను పక్కనెడుతున్న వైనం

రాజస్థాన్ లో సిద్దుకు పట్టం...?

తెలంగాణలో రేవంత్ రెడ్డికి అందలం

రాష్ట్రాల్లో బలోపేతమైతే...కేంద్రానికి చేరుకోవచ్చు...?

ఇదే కాంగ్రెస్ అధినాయకత్వం అసలు వ్యూహం

(జానోజాగో వెబ్ న్యూస్-పొలిటికల్ బ్యూరో)

దేశ రాజకీయాలలో సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కనుమరుగవుతోందన్న విమర్శలున్నాయి. సుధీర్ఘ రాజకీయ చరిత్రే కాదు అన్ని కాలాల రాజకీయాలను చూసిన ఘనత ఆ పార్టీ సొంతం. అందుకే ఆ పార్టీ ఉనికి కోల్పోతోందన్న వద్దంతులను ఎదుర్కొంటున్నా సుధీర్ఘ కాలం రాజకీయాలలో రాణిస్తోందన్న మాటను కూడా విస్మరించకూడదు. దేశ రాజకీయాలలో నరేంద్రమోడీ రాకతో పట్టిష్టమైన కార్యకర్తలను ఏర్పాటుచేసుకోవడంతోపాటు తనకున్న సోషల్ మీడియా టీంతో నేటికీ ఆ పార్టీ బలోపేతంగానే కనిపిస్తోంది. దేశ రాజకీయాలలో ఆ పార్టీని గట్టిగా ఎదుర్కొనే పరిస్థితి ఇప్పటికపుడు లేదనే చెప్పాలి. అందుకే కాంగ్రెస్ అధినాయకత్వం తన వ్యూహం మార్చుతోంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత రాహుల్ గాంధీ సామర్థ్యంపై ఇంట బయట విమర్శలు వెల్లువెత్తాయి. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ నాయకత్వం బాధ్యతల నుంచి తపుకొన్నా...సోనియా గాంధీ తాత్కాలిక నాయకత్వ బాధ్యతలు తీసుకొన్నా తెరవెనక నుంచి నెహ్రు...ఇందిరా గాంధీల కుటుంబమే కాంగ్రెస్ పార్టీని శాసిస్తోంది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందుకే రాష్ట్ర స్థాయిలో నాయకత్వ బాధ్యతల అప్పగింత సైతం గాంధీ కుటుంబం ఆదేశాల మేరకే సాగుతున్నాయి. ఇదిలావుంటే జాతీయ స్థాయిలో పరిస్థితులు అనుకూలించని వేళ రాష్ట్రాల్లో బలపడుతూ కేంద్రంలో పాగా వేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం పావులు కదుపుతోంది.


రాష్ట్రాలపై ఆశతో అడుగులు..?

జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీని, బీజేపీని ఢీకొంటూనే రాష్ట్రాల్లో బలపడటం ద్వారా కేంద్రంలో పాగా వేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం వ్యూహ రచన చేస్తోంది. ఇందుకోసం గత సంప్రదాయాన్ని పక్కనెట్టి పార్టీలోని సీనియర్ల వాదనకు తలొగ్గకుంటా పార్టీ రాష్ట్ర బాధ్యతల్లో మాస్ లీడర్స్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అధినాయకత్వం. ఇందుకు తాజా ఉధాహరణలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించడమే. మరోవైపు రాజస్థాన్ లో పీసీసీ బాధ్యతలు సిద్దుకు అప్పగించడం కూడా. పార్టీలోకి వచ్చిన మూడేళ్ల లోపే సీనియర్లను సైతం పక్కనెట్టి రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలను కాంగ్రెస్ అధినాయకత్వం అప్పగించింది.


టీపీసీసీ రాథ సారథి రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు మెండుగా ఉన్నా రాష్ట్ర వ్యాప్త ప్రభావం చూపే వారు లేరన్నది కాంగ్రెస్ అధిష్టానం భావన. ఇదిలావుంటే టీడీపీలోవుంటే మాస్ లీడర్ గా ఎదిగే క్రమంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నారు. కాస్త దూకుడు స్వభావమున్న ఆయనకు ఆ స్వభావం కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి సైన్యం పేరుతో ఓ నెట్ వర్క్ ఏర్పడింది.  ఇది కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు ఓ కారణంగా చెప్పవచ్చు. ఇక రాష్ట్రాల్లో బలపడటం ద్వారా హస్తీనాలో పాగా వేయడం ఎలా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. 2004, 2009లో కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ-1, యూపీఏ-2 సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. జాతీయ స్థాయిలో నాడు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోయినా ఇతర పార్టీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యా బలమొచ్చింది. అది కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ రాష్ట్రంలో అయితే మాస్ లీడర్ ఫాలోయింగ్ ఉందో ఆ రాష్ట్రాల నుంచే మెజార్టీ సంఖ్యలో ఎంపీ సీట్లు వచ్చాయి. అంటే గాంధీ కుటుంబం పేరుపై కాకుండా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాస్ ఫాలోయింగ్ వల్ల ఏపీలో మెజార్టీ ఎంపీ సీట్లను నాడు గెలుచుకొన్నారు. రెండు పర్యాయాలు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా ఏపీలో సైతం వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాయకత్వంలోనే రెండు పర్యాయాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాయకత్వంలో నాడు కూటమి ఏర్పాటుతో ఏపీలో కాంగ్రెస్ స్వతహాగా 29 ఎంపీ సీట్లు గెలవగా మిత్ర పార్టీలు 5 సీట్లను గెలుచుకొన్నాయి.

 


అంటే నాడు ఏపీ నుంచి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు 34 ఎంపీల బలం కలిసొచ్చింది. ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే స్వతహాగా 33 ఎంపీ సీట్లను గెలుచుకొంది. కేంద్రంలో కాంగ్రెస్ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చేందకు ఏపీ కీలక పాత్ర పోషించింది. నాడు ఏపీలో మెజార్టీ ఎంపీల సంఖ్య గెలవడానికి కారణం ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా వై.ఎస్.కు ఉన్న వ్యక్తిగత చరిష్మాయే. ఆయన మరణానంతరం తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆ పట్టు కోల్పోయింది. అందుకే రాష్ట్రాల్లో బలపడి కేంద్రంలో పాగా వేయాలన్న వ్యూహాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం అమలు చేస్తోంది. సీనియర్ల నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమైన తెలంగాణలో రేవంత్ రెడ్డికి, రాజస్థాన్ లో సిద్దుకు పీసీసీ నాయకత్వ బాధ్యతలను కాంగ్రెస్ నాయకత్వం అప్పగించింది. ఈ మాస్ ఫాలోయింగ్ బలంతో రాష్ట్రాల్లో బలపడి మెజార్టీ ఎంపీ సీట్లు సాధించడం ద్వారా కేంద్రంలో పాగా వేయాలన్నది కాంగ్రెస్ అసలు వ్యూహం అన్నది విశ్వసనీయ సమాచారం.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: