మరోసారి సత్తాచాటిన  ఏపి పోలీస్ శాఖ

అవార్డులను  ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ 

డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్-2021



ఆంధ్రప్రదేశ్ డి.జి.పి. డి. గౌతమ్ సవాంగ్, (ఐ.పి.ఎస్)

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

జాతీయ స్థాయిలో పాస్ పోర్ట్ వెరిఫికేషన్  లో  వరుసగా మూడోసారి మొదటి స్థానంలో ఎపి పోలీస్ శాఖ నిలిచింది. ఎపిలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పాస్ పోర్ట్ దరఖాస్తు వెరిఫికేషన్ ను ఏపీ పోలీసులు   పూర్తి చేశారు. టెక్నాలజీ  క్షేత్రం లో జాతీయస్థాయిలో అవార్డులను ప్రకటించిన డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్-2021 అత్యంత ఆధునిక టెక్నాలజీ వినియౌగంలో 04  అవార్డులను ఎపి పోలీసు శాఖ సొంతం చేసుకొంది. ఈ అవార్డులను పోలీస్ హెడ్  హెడ్క్వార్టర్స్ 3  కైవసం చేసుకోగా, అనంతపురం 01 అవార్డును కైవసం చేసుకుంది. కేవలం స్వల్ప నెలల కాలవ్యవధిలో జాతీయస్థాయిలో అత్యధికంగా  130  అవార్డులను దక్కించుకొని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ.  డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, HAWK, బాడి వొర్న్ కెమెరా స్ట్రీమింగ్,కోవిడ్ ట్రాకర్లు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి.
గతంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ చరిత్రలో  ఎన్నడూ  లేని విధంగా స్వల్ప నెలల వ్యవధిలో  రికార్డ్ స్థాయి  అవార్డులను దక్కించుకున్న  ఏకైక ప్రభుత్వ విభాగం  ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ. దేశం మొత్తం మీద డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్-2021 నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్న శాఖ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ మాత్రమే. ఈ అవార్డులు మా బాధ్యత ను మరింతగా పెంచాయి.ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారితనంతో , త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామని, జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే  సత్ఫలితాలు సాధిస్తున్నామన్న ఎపి డీజీపీ గౌతం సవాంగ్ (IPS) పేర్కొన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర న్యాయం  లకు గీటురాయిగా ఎపి పోలీస్ అని పేర్కొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: