భగత్‌సింగ్‌ త్యాగం వృథా కానీయం  

అందె నాసరయ్య

(జానో జాగో వెబ్ న్యూస్_  మార్కాపురం ప్రతినిధి)

భగత్ సింగ్ 114 వ జయంతి సందర్భంగా స్థానిక పూల సుబ్బయ్య భవనంలో సిపిఎం పార్టీ మరియు సిపిఐ పార్టీ,  అందె నాసరయ్య ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అందె నాసరయ్య మాట్లాడుతూ విప్లవానికి మారు పేరు భగత్‌సింగ్ అని, ‌ పోరాటాలకు నిలువెత్తు నిదర్శనమని స్వాతంత్య్ర పోరాటంలో యువ రక్తంతో దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన త్యాగశీలి,  నేటి యువతకు ఆదర్శప్రాయుడని ఇటువంటి విప్లవనేత జయంతిని పురస్కరించుకుని పాలకుల వినాశకర విధానాలపై గళం విప్పేందుకు యువత నడుంబిగించాలని పిలుపునిచ్చారు.

1907 సెప్టెంబర్‌ 27న పంజాబ్‌ రాష్ట్రం రాయల్‌పూర్‌ జిల్లా బంగా ప్రాంతంలో భగత్‌సింగ్‌ జన్మించారు సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన భగత్ సింగ్ ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే నినాదంతో స్వాతంత్య్ర పోరాటానికే వన్నెతెచ్చారని తన 13వ ఏటనే గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి ప్రభావితుడయ్యారు

1929లో బ్రిటీష్‌ అసెంబ్లీలో పొగబాంబు విసిరిన సంఘటనలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేశ్‌లు బ్రిటీష్‌ పాలకులనే గడగడలాడించారు. ఈ పోరాటంలో విప్లవం వర్థిల్లాలి, శ్రామికవర్గం వర్థిల్లాలి, సామ్రాజ్యవాదం నశించాలి, సోషలిజం వర్థిల్లాలనే ఉత్తేజింపజేసే నినాదాలను కూడా రూపొందించారు.

23 ఏళ్ల వయస్సుకే 1931 మార్చి 23న ఉరికంబమెక్కి దేశానికే ఆదర్శప్రాయుడయ్యాడు. ఆయన మరణం వృథా కాలేదు. అనంతరం ఎందరో యువకిశోరాలు స్వాతంత్య్ర పోరాటంలోకి వచ్చి ఉద్యమించారు

భగత్‌సింగ్‌ వంటి మహోన్నత ఆదర్శప్రాయుడి స్ఫూర్తితో ప్రస్తుత మతోన్మాద పాలకుల చర్యలను, ప్రపంచబ్యాంకు విధానాలు నెత్తినెక్కించుకున్న నేతల తలరాతలను మార్చాల్సింది కూడా భగత్‌సింగ్‌ వారసులుగా నేటి యువతరమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: