అంతర్ రాష్ట్ర నేరస్థుడుని ,,,

అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

రూ.11, 00,000/- విలువ గల 

21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొన్న పోలీసులు


ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్, (ఐ.పి.ఎస్.)

(జానోజాగో వెబ్ న్యూస్-ప్రకాశం జిల్లా ప్రతినిధి)

ప్రకాశం జిల్లా పోలసులు అంతర్ రాష్ట్ర నేరస్థుడుని అరెస్ట్ చేసి అతని నుంచి రూ.11, 00,000/- విలువ గల 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. వివరాలలోకి వెళ్లితే...దూదేకుల ఖలీల్ @గున్ను(28ఏళ్లు) S/o. ఆదాము, లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. మార్కాపురం పూల సుబ్బయ్య కాలనీకి చెందిన ఇతను కంభంలోని రంగరాజు స్కూల్ వద్ద నివాసముంటున్నాడు. ఇదిలావుంటే ఒంగోలు తాలూకా సిఐ  వి. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యములో ఒంగోలు తాలూకా ఎస్సై  ఎం. దేవకుమార్ ముద్దాయిని ఒంగోలు లోని నార్త్ బైపాస్ జంక్షన్ లో శుక్రవారంనాడు ఉదయం 10.00 గంటలకు అరెస్ట్ చేశారు. ఈ ముద్దాయి గతం నుండి నేరచరిత్ర కలిగి మోటార్ సైకిల్ చోరీలకు పాల్పడినందున ఇతనిపై నంద్యాల, కర్నూల్, అనంతపురం, మహబూబ్ నగర్, విజయవాడ, గిద్దలూరు, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో ఆయా పోలీస్ స్టేషన్ లలో కేసులు ఉన్నాయి. ఈ ముద్దాయి గతంలో 14 మోటార్ సైకిల్స్ చోరీ కేసులలో నిందితుడిగా ఉన్నాడు.

నెల్లూరు జిల్లాలో 2 కేసులు, కర్నూల్  జిల్లాలో 2 కేసులు, గుంటూరు రూరల్  జిల్లాలో 1 కేసు, గుంటూరు అర్బన్ జిల్లాలో 5 కేసులలో నిందితుడు. ఈ కేసులలో 4 కేసులలో శిక్షపడినది, 3 కేసులు కొట్టివేయబనవి మిగిలిన కేసులలో కోర్ట్ లో విచారణలో ఉన్నాయి. ఈ సంవత్సరం మే నెల నుండి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో 7 మోటార్ సైకిల్స్, ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మోటార్ సైకిల్స్, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 7 మోటార్ సైకిల్స్, మంగళగిరి రురల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మోటార్ సైకిల్స్, నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్ , కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్, మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్ వరుస చోరీలకు పాల్పడ్డాడు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుచుండగా,

ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ మలిక  గార్గ్ (IPS) సూచనల మేరకు ఒంగోలు తాలూకా సిఐ వి. శ్రీనివాసరెడ్డి వారి క్రైమ్ పార్టీ బృందాల ద్వారా నిఘా ఉంచి ముద్దాయిని పట్టుకొని అతని వద్ద నుండి రూ.11, 00, 000/- విలువ గల 21 మోటార్ సైకిల్స్ రికవరీ చేశారు. ఒంగోలులో వరుస మోటార్ సైకిల్స్ దొంగతనాలు ఫై నిఘా ఉంచి ముద్దాయిలను పట్టుకోవడంలో ఒంగోలు డీఎస్పీ కెవివిఎన్ వి ప్రసాద్ సారధ్యంలో ఒంగోలు తాలూకా సిఐ  వి. శ్రీనివాస రెడ్డి, ఒంగోలు తాలూకా ఎస్సై ఎంం. దేవకుమార్, ఒంగోలు తాలూకా క్రైమ్ పార్టీ సిబ్బంది కే.సురేష్, కే.రామకృష్ణ, వి.శ్రీనివాసులు, కే.రవికుమార్ లను ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ప్రత్యేకంగా అభినందించారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: