*ఆర్టీసీ ఉద్యోగులకు ‘టెర్మినల్‌ బెనిఫిట్స్‌’

ఇక నేరుగా లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లింపు

 *ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం* 


(జానో జాగో వెబ్న్యూస్_ విజయవాడ బ్యూరో)

అమరావతి: పదవీవిరమణ చేసిన, ఇతరత్రా కారణాలతో ఉద్యోగాల నుంచి వైదొలగిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2020, జనవరి 1 తర్వాత రిటైరైన, ఉద్యోగాల నుంచి వైదొలగిన వారికి టెర్మినల్‌ బెనిఫిట్స్‌ చెల్లింపునకు మార్గం సుగమం చేసింది. వారికి లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లింపుల కోసం అకౌంట్‌ హెడ్‌ నంబర్లు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ గురువారం ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకున్న ఈ ప్రత్యేక అకౌంట్‌ హెడ్‌ కేటాయింపులు తొలిసారిగా ఆర్టీసీ ఉద్యోగులకూ రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేసింది.

 సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా నేరుగా లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లిస్తారు.సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంస్థ ఉద్యోగులకూ ఈ అవకాశం కలిగింది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసును ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ను వర్తింపజేసింది. ప్రమాద బీమా, జీవిత బీమా

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: