తర్లుపాడు టిడిపి మండల పార్టీ అధ్యక్షుడిగా ,,,
రెండవ సారి ఉడుముల చిన్నపరెడ్డి,,
ఏకగ్రీవ ఎన్నిక
(జానో జాగో వెబ్ న్యూస్_ మార్కాపురం ప్రతినిధి)
తర్లుపాడు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడిగా రెండవ సారి ఉడుముల చిన్నపరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా తర్లుపాడు మండలం తెలుగుదేశం పార్టీ మండల కమిటీను తెలుగుదేశం గ్రామ కమిటీలు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మండల కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యకర్తల సమావేశం మార్కాపురం పట్టణం లోని జవహర్ నగర్ లో గల మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వగృహం వద్ద జరిగినది.
మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఎ. కందుల నారాయణ రెడ్డి
ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి ఇసుక మరియు సిమెంట్ ధరలు విపరీతంగా పెంచి లక్షల భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడవేసి వారి కుటుంబాల ఉసురు తీస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ కు నికర జలాలు కేటాయించి మొదట టన్నెల్ ద్వారా నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
ఇప్పుడుుడు రాష్ట్రంలో ఏ గ్రామంలో కదలించిన సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం పని అయిపోయిందని అంటున్నారు అని మనం మన తెలుగుదేశం పార్టీ తరుపున ఉద్యమాలు చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలపాలని అనుకుంటున్నారని తక్షణమే ఇప్పుడు ఎన్నుకో బోయే తర్లుపాడు తెలుగుదేశం మండల కమిటీ గ్రామ కమిటీల తో తెలుగుదేశం నాయకులతో కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఈ వై సి పి పార్టీ దుర్మార్గపు దృష్ట పాలనకు భవిష్యత్తులో చరమగీతం పాడాలంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్త స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తిరగ బడాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో తర్లుపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రెండవ సారి వరుసగా ఉడుముల చిన్నపరెడ్డి ఏకగ్రీవంగాఎంపిక చేయబడ్డారు. మండల ప్రధాన కార్యదర్శి గా కందుల చిట్టిబాబు, ఉపాధ్యక్షులుగా నంబుల లక్ష్మయ్య ఎంపిక చేయబడ్డారు. మండల యూత్ కమిటీ అధ్యక్షులు గా మేకల వెంకట్ నారాయణ, మండల రైతు కమిటీ అధ్యక్షులుగా కూచిపూడి సోమయ్య, మండల బీసీ సెల్ అధ్యక్షులు గా గుర్రపుశాల నరసింహారావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు గా ముండ్ల పాటి వెలిగొండయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సమావేశంలో మార్కాపూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య, మాజీ ఎంపీపీ పులివెముల యేసుదాసు, మండల సమన్వయ కమిటీ సభ్యులు వేసేపోగు జాన్, మంద వెంకటరెడ్డి, నరసింహ రావు, కాలoగి శ్రీనివాసులు, సాదం వీరయ్య , పుచ్చనూతల గోపీనాథ్ చౌదరి, తెలుగుదేశం నాయకులు ఈర్ల వెంకటయ్య, గోసు వెంకటేశ్వర్లు, చలమయ్య , మేకల అచ్చిరెడ్డి, నంబుల కాశయ్య , మాబు వలి, చెన్నారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి,, ఈదర శ్రీనివాస రెడ్డి గారు, చలమారెడ్డి, నంబుల తిరుపతయ్య , తెలుగుదేశం నాయకులు గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, తెలుగుదేశం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి