మరణించిన జర్నలిస్ట్ లకు,,,ఘననివాళ్లులు

జర్నలిస్టులతోవున్న అనుభూతిని పంచుకొన్న ఎమ్మెల్యే కుందూరు

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

   ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో మరణించిన జర్నలిస్టుల చిత్రపటానికి పూలమాలవేసి మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి నివాళులర్పించారు. గత నెలలో ప్రమాదవశాత్తు మరణించిన ఆంధ్రప్రభ విలేకరి పెండ్యాల కొండయ్య, కుందూరు శ్రీనివాస్ రెడ్డి సంతాప సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మార్కాపురం శాసన సభ్యులు కుందూరు  నాగార్జున రెడ్డి మాట్లాడుతూ... కొండయ్య చిన్నపిల్లల మనస్తత్వం అని నాకంటే ముందు గా ఎమ్మెల్యే గారు మీరు ఫోటోకి స్టీల్ ఇవ్వండి అని ఎన్నో ఫోటోలు తీసి నవ్విస్తూ చిరునవ్వుతో ఉండే వ్యక్తి అని ప్రజల సమస్యలను తన కలం ద్వారా వినిపించేవారని, ప్రజా సమస్యలపై ప్రత్యేక కథనాలు రాసేవారిని అన్నారు. ఇద్దరి జర్నలిస్టుల ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ సంతాప సభ కన్నీటి పర్వం తో ఉండదని వారిపై ఎంత ఆప్యాయత ఉంటే ఇలా ప్రతి ఒక్కరు కన్నీటి పర్వంతంతో ఉండదని వారిపై ఎంత ఆప్యాయత ఉంటే ఇలా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతారని అన్నారు.


 

ఈ సందర్భంగా CNK5 ఛానల్ సీఈవో భాస్కర్ మాట్లాడుతూ జర్నలిస్టు సోదరులకు ఎటువంటి ఆదాయ వనరులు ఉండవని వార్త సేకరణ కోసం తాపత్రయం చెందుతారని అన్నారు. CNK5 ఛానల్ జర్నలిస్ట్ అకాల మరణం చెందిన కుందూరు శ్రీనివాస రెడ్డి కుటుంబానికి 50 వేల రూపాయల నగదు అదేవిధంగా వారి పిల్లల విద్యాభ్యాసానికి ఎంత ఖర్చు అవుతుందో అంత CNK5 న్యూస్ ఛానల్ సీఈవో భాస్కర్ బాధ్యత తీసుకుంటానని  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండలం తహసిల్దార్  శైలేంద్ర కుమార్, ఎంపీడీవో నరసింహులు, సర్పంచ్ పల్లెపోగు.వరాలు, మాజీ సర్పంచ్ సూరెడ్డి సుబ్బారెడ్డి, కేతగుడిపి సర్పంచ్ పెద్ద మస్తాన్, ఉప సర్పంచ్ వెన్న.పెద్ద సత్యం వైసిపి నాయకులు మురారి వెంకటేశ్వర్లు, దేవి రెడ్డి రమేష్,కొండారెడ్డి కుటుంబ సభ్యులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: