మైనార్టీల కోసం ప్రత్యేక,,,

రక్షణ చట్టం తేవాలి

మైనార్టీలకు న్యాయం కోసం...ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి

జానోజాగో సంఘం నేత సయ్యద్ నిసార్ అహ్మద్

జానోజాగో సంఘం జాతీయ అధ్యక్షులు  సయ్యద్ నిసార్ అహ్మద్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ఏపీలో మైనార్టీలపై దాడులు పెట్రేగిపోతున్నాయని జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ ఆందోళన వ్యక్తంచేశారు. ఏ పార్టీ ప్రభుత్వమున్న దాడులు నిత్యంగా మారుతున్నాయన్నారు. మైనార్టీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ముస్లింలపై దాడులు, స్త్రీలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించి నేరస్థులకు త్వరగా శిక్ష పడేలా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం ముస్లిం ప్రజానికం అందరూ ఏకమై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు.
కేవలం ఓటు బ్యాంకుగానే ముస్లింలను అన్ని ప్రభుత్వాలు చూస్తున్నాయని, కానీ ఆ ఓటు బ్యాంకు శక్తిని మాత్రం లెక్కలేనితనంగా చూస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ముస్లింలంటే కేవలం ఓటు రూపంలోనే కాకుండా ఆ ఓట్లు ఏకమై శక్తిగా మారితే ఏమవుతుందో తామ సంఘం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. త్వరలోనే జానోజాగో సంఘం తరఫున తాను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో విస్త్రుత పర్యటనలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసి ఓ ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తామన్నారు. ఏ పార్టీ ఆ మేనిఫెస్టో అంగీకరిస్తుందో వారికి మద్దతు ఇస్తామన్నారు. అంతేకాకుండా ఆ మేనిఫెస్టో అమలు చేసేలా ఒత్తిడి కూడా తీసుకొస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు టిక్కెట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ముస్లింలో నాయకత్వం పెంపొందించే బాధ్యత జానోజాగో సంఘం చేపడుతుందని ఆయన వెల్లడించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: