"ఆకాంక్ష",,,
అర్ధ శాతం పూర్తి!!
(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)
శాంతిరాజ్-అక్ష ఖాన్ జంటగా నందీశ్వర ఫిలిమ్స్ పతాకంపై హరికృష్ణ దర్శకత్వంలో శ్రీమతి సుహాన నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథాచిత్రం "ఆకాంక్ష". చిత్రం శ్రీను, జ్యోతి స్వరూప ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రస్తుతం యానాంలో జరుగుతోంది. హీరో శాంతిరాజ్, హీరోయిన్ అక్ష ఖాన్, చిత్రం శ్రీను, జ్యోతి స్వరూపాలతోపాటు... ఇతర ముఖ్యతారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
దర్శకనిర్మాతలు మాట్లాడుతూ... ప్రేమలోని కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. హీరో శాంతిరాజ్ కు మంచి బ్రేక్ ఇచ్చే చిత్రమిది. యానాం, కాకినాడ, పిఠాపురంలో జరిపిన షెడ్యూల్స్ తో సగం చిత్రీకరణ పూర్తయింది. మిగతా సగం విజయవాడ, హైదరాబాద్ లలో షూట్ చేస్తాం" అన్నారు.
ఈ చిత్రానికి పోరాటాలు: రవి, నృత్యాలు: బాలు-సురేష్, కూర్పు: కొండేటి వేణు, ఛాయాగ్రహణం: యేసు.పి, సంగీతం: అర్జున్, నిర్మాత: శ్రీమతి సుహాన, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: హరికృష్ణ!!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: