వెలిగొండను అడ్డుకోవడం,,

ఎవరి తరం కాదు

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

వెలిగొండ విషయంలో టీడీపీ నేతలు తమ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు అని  వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. అయితే వెలిగొండ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనడం సరికాదని ఆయన అన్నారు.  తాము పట్టించుకోకపోతే వెలిగొండ నిర్మాణం 80 శాతం పూర్తయ్యేది కాదన్నారు ఏలూరి. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదేళ్లు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రెండేళ్లు.. మొత్తం ఏడేళ్లలోనే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు వెలిగొండను నిర్లక్ష్యం చేసి.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు వేదాలు వల్లిస్తూ  మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కేవలం వైఎస్ కుటుంబం అధికారంలో ఉన్న సమయంలోనే జరుగుతుందన్న విషయం ప్రజలకు కూడా తెలుసని చెప్పిన ఏలూరి..

టీడీపీ నేతలు క్రెడిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో వెలిగొండలో దమ్మిడి పని చేయకుండా ఇప్పుడు ఏదో అన్యాయం జరుగుతుందని గుండెలు బాదుకోవడం హాస్యాస్పదం అన్నారు. మరోవైపు వెలిగొండ ప్రాజెక్టును అక్రమంగా కడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించడాన్ని కూడా ఏలూరి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని అనుమతులు వచ్చాయన్నారు. వెలిగొండను అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు. టీడీపీ నేతలు వెలిగొండ విషయంలో అతి రాజకీయాలు చేయడం మానాలన్న ఏలూరి.. వారు చేస్తున్న దుష్ప్రచారం వలన ప్రజలు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని చెప్పారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: