ప్రజాప్రతినిధుల బందువులు...

అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటే...క్రిమినల్ కేసులే

పంచాయతీ రాజ్ కమీషనర్ ఆదేశాలు జారీ


పంచాయతీరాజ్ కమీషనర్ గిరిజాశంకర్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

      ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో, కార్యక్రమాలలో పాల్గొనడానికి వీలు లేదు, అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీ రాజ్ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ యొక్క అధికారిక సమావేశాలలో ప్రజా ప్రతినిధుల యొక్క భార్య / భర్తలు, కుటుంబ సభ్యులు, చుట్టాలు పాల్గొంటున్నారని.. అంతేగాక పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని, పలు ప్రభుత్వ కార్యాలయాలలో  ఆజమాయీషి, పెత్తందారితనం ఎక్కువ అవుతున్నట్లు పలు ప్రాంతాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యాలయం & కమీషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీనికి స్పందించిన పంచాయతీ రాజ్ కమీషనర్ జిల్లాల కలెక్టర్ లకు ఈ రకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.


                 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

-ప్రజా ప్రతినిధుల (వార్డ్ సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీపీపీ) కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో , కార్యక్రమాలలో పాల్గొనడానికి వీలు లేదు. అలా పాల్గొంటున్నారని తెలిస్తే, సంబంధిత పంచాయతీ సెక్రటరీ, ఎంపీఓ, ఎంపీడీఓ, డీపీఓ, జడ్పీ సీఐఓ లపై కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని, అలాగే  రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం 2018 - సెక్షన్ 37(5) ప్రకారం (women) ప్రజా ప్రతినిధుల భర్త / కుటుంబ సభ్యులు / చుట్టాలపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని. ఇలాంటి సమస్యలు ప్రజలు చూస్తే పంచాయతీ రాజ్ కమీషనర్ లేదా కలెక్టర్ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగలరు. అని సూచించారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: