పరిశ్రమ పునరుద్ధరణ కోసం,,,
పలు సూచనలు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసిన హెచ్ఏఐ
(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)
భారతదేశపు ఆతిథ్య పరిశ్రమకు చెందిన అత్యున్నత సంస్థ హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) నేడు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖామాత్యులు జి.కిషన్‌రెడ్డిని కలుసుకోవడంతో పాటుగా ప్రస్తుత మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పరిశ్రమ స్థితిగతులను ఆయనకు తెలియజేసింది. అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె బీ కచ్రు, ఛైర్మన్ ఎమిరిటస్ అండ్ ప్రిన్సిపల్ ఎడ్వైజర్– దక్షిణాసియా, రాడిసన్ హోటల్ గ్రూప్ నేతృత్వంలోని బృందం మంత్రిని కలువడంతో పాటుగా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించింది. ఈ బృందంలో ఎం.పీ. బెజ్బారూవా, సెక్రటరీ జనరల్ ; డాక్టర్ జోత్స్న సూరి, కార్పోరేట్ మెంబర్, హెచ్ఏఐ మరియు ఛైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, భారత్ హోటల్స్ లిమిటెడ్ ; రోహిత్ ఖోస్లా, సభ్యులు, హెచ్ఏఐ మరియు ఎగ్జిక్యూటివ్ వీపీ, ఐహెచ్‌సీఎల్ ; చారులత సుఖిజా, డిప్యూటీ సెక్రటరీ జనరల్ , హెచ్ఐఏ సైతం ఉన్నారు.
మారటోరియం పొడిగింపు, ఒక్కసారి ఋణ పునర్నిర్మాణం, ఈసీఎల్జీఎస్ పథకం కింద నియమాలను మెరుగుపరచడం, రిజల్యూషన్ కార్యాచరణ కింద అర్హత నిష్పత్తులను సవరించడం ద్వారా పరిశ్రమలో లిక్విడిటీని జొప్పించాల్సిన అత్యవసర ఆవశ్యకత ఉందని వెల్లడించడంతో పాటుగా విధాన పరమైన మార్పులను సైతం చేయడాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా అసోసియేషన్ అభ్యర్థించింది.
మౌలిక వసతుల పరిశ్రమ హోదాతో తమను కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లయితే, అతి తక్కువ వడ్డీరేట్లతో నిధులను పొందడంతో పాటుగా ప్రస్తుతం నౌకాశ్రయాలు, హైవేలు, రైల్వేలు లాంటివి పొందుతున్నట్లుగా పన్ను ప్రయోజనాలనూ పొందగలమని ఎంతోకాలంగా ఈ పరిశ్రమ అభ్యర్థిస్తుంది. ఇటీవల కొన్ని రాష్ట్రాలు అందించినట్లుగా పరిశ్రమ హోదాను ఇతర రాష్ట్రాలు కూడా అందించేలా ప్రోత్సహించాల్సిందిగా ఈ అసోసియేషన్ కోరడంతో పాటుగా పరిశ్రమ పునరుద్ధరణ కోసం మద్దతునందించాల్సిందిగా అభ్యర్ధించింది . అధికశాతం హోటల్ నిర్వహణ ఖర్చులు స్థిరంగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులలో అవి భరించలేని రీతిలో ఉన్నాయి. అతి తక్కువ ఆస్తిపన్ను, భూములను తక్కువ ధరకు అందించడం, విద్యుత్,నీరు లాంటి వాటిని తక్కువ ధరకు అందించడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. పరిశ్రమ పునర్ధురణ, పునరుజ్జీవనం, దీర్ఘకాలిక వృద్ధికి సహాయపడటానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌లో భాగం కావడానికి హెచ్ఏఐకు అవకాశం కల్పించారు. హెచ్ఏఐ ప్రతినిధి బృందం వివరించిన సమస్యలను ఓపిగ్గా ఆలకించిన మంత్రి, ఈ సమస్యలను పరిష్కరించేందుకు హామీ నివ్వడంతో పాటుగా హెచ్ఏఐతో చర్చలను కొనసాగించనున్నట్లు వెల్లడించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: