విలీనం విషయంలో ఆందోళన వద్దు

ఏ ఒక్కరి ఉద్యోగం పోదు

విలీనం మంచి ఫలితాలను ఇస్తుంది

 జిల్లా విద్యాశాఖ అధికారి వి ఎస్ సుబ్బారావు


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఉన్నత పాఠశాలలో మూడు, నాలుగు, ఐదో తరగతులను విలీనం చేయడం ద్వారా ఎవరికి నష్టం వాటిల్లదని, పైగా మంచి ఫలితాలు వస్తాయని ప్రకాశం  జిల్లా విద్యాశాఖ అధికారి వి ఎస్ సుబ్బారావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) లో ఉప విద్యాశాఖాధికారి జె.అనిత రోజ్ రాణి అధ్యక్షతన "నూతన విద్యా విధానం అమలు - ఆవశ్యకత" అనే అంశంపై డివిజన్ స్థాయి ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి వి ఎస్ సుబ్బారావు మాట్లాడుతూ 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే విషయంలో వ్యక్తమవుతున్న పలు సందేహాలను నివృత్తి చేశారు.
ఏ ఒక్క పాఠశాల కూడా మూత పడదని, ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా రద్దు కాదని, ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉన్నత పాఠశాలల్లోని ల్యాబ్, గ్రంథాలయం, ఆట వస్తువులు, VCR/DCR అందుబాటులోకి రావడమే కాకుండా, సీనియర్  విద్యార్థుల సామర్ధ్యాలను చూసి సహజంగా అనుకరిస్తూ మరిన్ని విషయాలు నేర్చుకుంటారని, ఎక్కువ సంవత్సరాలు ఒకే పాఠశాలలో ఉండడం వల్ల విద్యార్థికి ఉపాధ్యాయులకు మధ్య అనుబంధం పెరుగుతుందని, ఎక్కువ మంది విద్యార్థులు ఉండడంతో మధ్యాహ్న భోజనంలో కూడా నాణ్యత మెరుగవుతుందని, చిన్న తరగతుల నుంచే NTSE, NMMS వంటి పరీక్షలపై అవగాహన ఏర్పడుతుందని, ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసే కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగాహన కలుగుతుందని, విధంగా 3, 4, 5 తరగతుల విలీనం వల్ల విద్యార్థులకు అనేక రకాలుగా ఉపయోగం కలుగుతుందని, కాబట్టి ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని మెరుగైన వ్యవస్థ కోసం మార్పును స్వాగతించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఉప విద్యాశాఖాధికారి సామ సుబ్బారావు,  స్థానిక మండల విద్యాశాఖాధికారి రాందాస్ నాయక్, స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్ర శేఖర్ రెడ్డి, డివిజన్ లోని అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విలీనం అవుతున్న మండల పరిషత్ ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు హాజరయ్యారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: