కరెంటు తీగలు తగిలి..
రైతు మృతి... కేసు నమోదు
(జానో - జాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని గొల్లపల్లి గ్రామంలో బండి అల్లూరయ్య తన పొలంలో అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్నాడు. ఈ క్రమములో కరెంటు వైర్ల జాయింట్లు అలాగే ఉంచెవాడు, పలుమార్లు చుట్టుప్రక్కల రైతులు ఆ కరెంటు వైర్లు తీయమని పదే పదే చెప్పిన వినకుండా తీయకపోవడంతో ఈరోజు అదే గ్రామానికి చెందిన ఉమా రెడ్డి.లక్ష్మి రెడ్డి అనే రైతు తన పొలంలో నీళ్లు కడుతూ ఉండగా ప్రక్కనే ఉన్న కరెంటు వైర్లు తగిలి మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే తాడి వారి పల్లి ఎస్ఐ సువర్ణ తన సిబ్బందితో మృతదేహాన్ని పరిశీలించి మార్కాపురం జిల్లా వైద్యశాలకు పోస్టుమార్టం కోసం పంపించడం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: