భారత స్వాతంత్ర్య ఉద్యమంలో,,,
హిందూ ముస్లిం సముదాయాల ఐక్యత -
శాంతియుత చర్చావేదిక
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో హిందూ ముస్లిం సముదాయాల ఐక్యత శాంతియుత చర్చావేదిక కార్యక్రమము స్థానికి అల్ హిలాల్ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగింది ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ మన మాతృభూమి జాతీయ సమైక్యత. దేశ సుస్థిరత .దేశ అభివృద్ధి అఖండ భారతం వసుధైక కుటుంబం కోసం మత సామరస్య సోదర భావవ్యక్తీకరణశాంతియుత చర్చావేదికలు జరుపు కోవటం అవసరమన్నారు దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కులాలకు మతాలకు జాతులకు అతీతంగా పోరాటాలు త్యాగాలు చేశారని ప్రస్తుతం దేశంలో కొన్ని శక్తులు పన్నాగం పన్ని దేశ సుస్థిరత జాతీయ సమైక్యతకు భగ్నం చేసి కుల మతాల కుంపటి రాజేసి దేశంలో అస్థిరత సృష్టించటానికి ప్రయత్నిస్తున్నారని మన మంతా ఒకే తల్లి తండ్రి బిడ్డల్లా కలిసి మెలసి ఉన్నప్పుడే దేశ సుస్థిరత అఖండ భారతం సాధ్యమని మనమంతా వసుధైక కుటుంబంగా కొనసాగినప్పుడే దేశం అభివృద్ధి పథంలో కొనసాగుతుందని అన్నారు. ముస్లిం మత విద్వాంసులు మాట్లాడుతూ దేశం ఓ పూతోటని ప్రతి పుష్పం వికసించినప్పుడే విశ్వానికి పరిమళాలు సువాసన లు వెదజెల్లుతాయని అన్నారు.బాలాజీ మనోహర్. అనిల్ కుమార్ .డీఈ రమేష్ లు మాట్లాడుతూ సోదర భావం .సామరస్యం వలన హెచ్చుతగ్గులు వివక్ష దూరమవుతుందని అన్నారు.
ఎస్డీజీఎస్ కళాశాల ప్రిన్సిపల్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ దేశంలో కొన్ని మైనార్టీ సామాజిక వర్గాల పై కొందరు ఇబ్బంది కరమైన వాతావరణం సృష్టిస్తున్నాయని ఇదే జరిగితే ప్రపంచ దేశాల సరసన దేశం పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు .దేశ స్వాతంత్రం తో పాటు ప్రస్తుత పరిస్థితులలో కుల మతాలకు వర్గ వర్ణాలకు అతీతంగా వసుధైక కుటుంబంగా సాగితే నే పాకిస్తాన్ చైనాలాంటి దుష్ట శక్తులను ఎదుర్కోగలమని ఉమర్ ఫారూఖ్ ఖాన్ అన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం ఉలేమాలు. ప్రజా సంఘాలు. అఖిలపక్షం సభ్యులు సామాజిక సేవకులు అమనుల్లా. మహబూబ్ బాషా. ఉబేదుల్లా హుసేనీ.ఫైరోజ్ అలీ. దుర్గానవీన్.విమల్ . అంజినేయులు. అసోషియేషన్ సభ్యులు తదితరులు పాల్గొని జైహింద్ మేరా భారత్ మహాన్ నినాదాలతో కార్యక్రమం ముగించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: